Begin typing your search above and press return to search.

జంపింగ్ జఫాంగులకు జనసేన డోర్స్ క్లోజ్...పవన్ డెసిషన్ ...?

By:  Tupaki Desk   |   27 Jun 2023 5:00 AM GMT
జంపింగ్ జఫాంగులకు జనసేన డోర్స్ క్లోజ్...పవన్ డెసిషన్ ...?
X
ప్రతీ ఎన్నికకూ జంపింగ్ జఫాంగులు ఉంటారు. వారు గాలి ఎటు వైపు ఉంటే అటు వైపు మళ్ళుతారు. అలా అధికార పార్టీ నుంచి విపక్షం వైపు వస్తారు. ఇక విపక్షంలో కూడా ఒక పార్టీ నుంచి సీటు ఆశించి రాకపోతే మరో పార్టీకి వెళ్తారు. ఆ డోర్ తడతారు. ఇవన్నీ కామన్. అయితే తెలుగుదేశం వైసీపీలు జంపింగ్ జఫాంగులకు ఆహ్వానం పలుకుతున్నా పవన్ మాత్రం జనసేనలో అలాంటి వారికి నో చాన్స్ అనేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది.

వారాహి యాత్ర సందర్భంగా గోదావరి జిల్లాలలో పార్టీ పరిస్థితి మీద నేతలతో చర్చిస్తూ సమీక్షిస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలే దానికి నిదర్శనం అని అంటున్నారు. జనసేనలో ఉన్న వారు కమిట్ మెంట్ తో ఉండాలని పవన్ ఉద్బోధించారు. రేపటి రోజున గెలిచిన తరువాత ప్రజల కోసం పనిచేయాలని పార్టీ బ్యానర్ కి ఏ మాత్రం మచ్చ రాకుండా ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు.

మరో వైపు గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసి ఓడిన వారితోనూ పవన్ చర్చలు జరిపారు. పార్టీ పట్ల నిబద్ధత అవసరం అని అన్నారు. ఓడినా తాను గట్టిగా బలంగా నిలబడ్డానని అదే తీరు నేతలలో కూడా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. దీన్ని బట్టి ఆలోచించే వారు అంతా పవన్ కళ్యాణ్ మొదటి నుంచి తన పార్టీని నమ్ముకున్న వారికే టికెట్లు ఇస్తారని అంటున్నారు.

వారంతా పార్టీ ఓడినా కూడా నాలుగేళ్ల కాలంలో అంకితభావంతో పనిచేశారని, వారి నిబద్ధతను చాటుకున్నారని పవన్ భావిస్తున్నారు అని అంటున్నారు. ఒక రాజోలు ఎమ్మెల్యే వైసీపీ నుంచి వస్తే 2019లో టికెట్ ఇచ్చారు. ఆయన గెలిచిన తరువాత తిరిగి వైసీపీలోకి వెళ్ళిపోయారు. దాంతో ఇతర పార్టీల నుంచి ఎన్నికల వేళ వచ్చి కండువాలు కప్పుకునే వారిని నమ్మకూడదని పవన్ గట్టిగా తీర్మానించుకున్నారని అంటున్నారు.

అదే సమయంలో పవన్ చాలా ముందు చూపుతో ఆలోచిస్తున్నారని అంటున్నారు. రేపటి రోజున పొత్తులలో భాగంగా ప్రతీ ఒక్క సీటుని గెలుచుకోవాలని ఆయన తలపోస్తున్నారు. ఈ గెలిచిన సీట్లతో ఏపీలో బలమైన థర్డ్ ఫోర్స్ గా మారాలన్నది ఆయన ఆలోచన. రేపటి ఎన్నికల తరువాత టీడీపీతో పొత్తు ఉన్నా సొంత రాజకీయం చేసే సమయంలో ఎవరైనా ఆలోచనలు మార్చుకుంటే అపుడు ఇబ్బంది వస్తుందని భావించే పవన్ ఆచీ తూచీ వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు.

అందుకే ఆయన తనను చూడాలని నేతలను కోరుతున్నారు. ఎవరూ ఎపుడూ పార్టీ లైన్ దాటవద్దను, పార్టీకే కట్టుబడి ఉండాలని పవన్ కోరుతున్నారు. దీంతో ఎన్నికల టైం లో వచ్చే అయారాం గయారాం లకు జనసేనలో అయితే టికెట్లు ఇవ్వరని అంటున్నారు. ఒక వేళ పార్టీ కోసం పనిచేస్తామని వస్తే చేర్చుకోవచ్చు కానీ టికెట్ భరోసా అయితే ఉండదని, జనసేన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వారికి కొత్త తరం నేతలకు టికెట్లు ఇవ్వాలని పవన్ చూస్తున్నారు అని తెలుస్తోంది.

దీంతో వైసీపీలో టికెట్లు దక్కకపోతే వచ్చే వారికి జనసేనలో టికెట్లు దక్కే సీన్ అయితే ఉండదనే అంటున్నారు. అదే టైం లో టీడీపీ చేర్చుకున్నా పొత్తుల వల్ల కొన్ని సీట్లు త్యాగం చేయడంతో అక్కడ ఎంత మేరకు అవకాశాలు ఉంటాయో కూడా ఆలోచించాల్సిందే అంటున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఆపరేషన్ వైసీపీ అంటున్నారు. వచ్చిన వారిని చేర్చుకునేందుకు రెడీ అవుతున్నారని అంటున్నారు.