Begin typing your search above and press return to search.
పీకే రూట్ మ్యాప్.. టీడీపీ -కమ్యూనిస్ట్స్- టీఆర్ఎస్-బీజేపీ.. ఏందబ్బా వకీల్ సాబ్..!
By: Tupaki Desk | 31 March 2021 10:16 AM GMTసినిమాల పరంగా తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ అంటే ఒక క్రేజీ హీరో. ఆయన సినిమా కోసం కళ్లు కాయలు కాసేలా చూసే ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవల ఆయన సినిమా ట్రైలర్ విడులైతేనే ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. అయితే పవన్ కల్యాణ్ సినిమాల్లో ఇంత పేరు సంపాదించుకొని రాజకీయాల్లో ఉన్నదంతా పొగొట్టుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఓ వైపు యూత్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా ఉన్నా.. ఇంకా అనుభవం రానీ రాజకీయ నేత గా పోలిటికల్ గా ముద్రపడిపోతున్నారు. ఒక్కసారి ఆయన రూట్ మ్యాప్ చూస్తేనే అర్థమవుతుంది.. నిలకడలేని రాజకీయ నాయకుడని కొందరు విమర్శలు చేస్తున్నారు.
2014 వరకు సినిమాల్లో జోష్ పెంచిన పవన్ ఒక్కసారిగా రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో టీడీపీ - బీజేపీ తరుపున ప్రచారం చేసి వైసీపీని ఆడిపోసుకున్నాడు. ప్రత్యేకంగా జగన్ ను టార్గెట్ చేసిన ఆయన తన ఘాటైన విమర్శలతోనే వైసీపీని ఓడగొట్టాడన్న పేరు వచ్చింది. అయితే ఆ తరువాత సొంతంగా పార్టీ పెట్టిన ఆయన కమ్యూనిస్టులతో కలిసి వెళ్లాడు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఒకే ఒక్క సీటును గెలుచుకున్నాడు. రెండు చోట్ల పోటీ చేసినా పవన్ గెలవకపోవడం గమనార్హం. కమ్యూనిస్టులతో లాభం లేదనుకున్న పవన్ వారికి దూరంగా ఉన్నాడు.
పాపం పవన్ జెండా పీకేస్తాడేమోనని బీజేపీ ఆశ్రయం ఇచ్చింది. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణ విషయానికొస్తే తాను పార్టీ పెట్టే మందుకు టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ను స్వయంగా కలిశాడు. తన మద్దతు కేసీఆర్ కే నని ప్రత్యక్షంగా చెప్పకపోయినా ఆయన ప్రవర్తన చూస్తే అర్థమైంది. పార్టీ పెట్టిన తరువాత విభజన విషయంలో తెలంగాణ నేతలు అన్యాయం చేశారని విమర్శలు గుప్పించారు. ఇక గత సెప్టెంబర్ లో దుబ్బాక ఉప ఎన్నిక తరువాత బీజేపీ నాయకులను పొగడ్తలతో ముంచెత్తారు. ఆ తరువాత మళ్లీ కమలంతో చేయి కలిపారు. అయితే ఇటీవల ఆయన తనను వాడుకొని వదిలేశారన్నట్లు చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ బీజేపీ నేతల ప్రవర్తనకు విసుగు చెందిన టీ. బిజేపీతో కటిఫ్ చేసుకున్నారు.
ఇదంతా ఒక ఎత్తయితే ఇటీవల విశాఖ ప్రైవేటీకరణ విషయంలో బీజేపీపై పవన్ అలిగినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తే బీజేపీ కంటే జనసేనకే ఎక్కువ సీట్లు వచ్చాయి. దీంతో జనసైనికులు కొందరు బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని సూచిస్తున్నారు. కానీ పవన్ మాత్రం మౌనంగానే ఉంటున్నాడు. దీంతో జనసైనికులకు అసహనం పుట్టుకొస్తోంది. పార్టీని దశ, దిశ లేకుండా చేస్తున్నారని లోలోపల మథన పడుతున్నారట.. అసలు బూత్ లెవల్ల్ లో క్యాడర్ పూర్తిగా లేదని, ఏదో జనం పవన్ క్రేజ్ చూసి వస్తున్నారని అనుకుంటున్నారట. చివరికి తాము ప్యాకేజీ బ్యాచ్ గా మిగిలిపోతామోనని ఆందోళన చెందుతున్నారట.