Begin typing your search above and press return to search.

వివాదంగా మారిన ట్వీట్‌..ప‌వ‌న్ వివ‌ర‌ణ

By:  Tupaki Desk   |   26 Jan 2017 11:57 AM GMT
వివాదంగా మారిన ట్వీట్‌..ప‌వ‌న్ వివ‌ర‌ణ
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా డిమాండ్ చేస్తూ విశాఖ‌లో జ‌రుగుతున్న కొవ్వొత్తుల ర్యాలీకి ట్వీట్లు - పాట‌ల‌ ద్వారా త‌న సంఘీభావం తెలుపుతున్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కు ఊహించ‌ని ప‌రిణామం ఎదురైంది. ప‌వ‌న్ చేసిన ట్వీట్ త‌మ మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా ఉంద‌ని ప‌లువురు సోష‌ల్ మీడియా వేదిక‌గా అసంతృప్తి వ్య‌క్తం చేశారు. దీంతో ప‌వ‌న్ వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. త‌ను ఎవ‌రిని గాయ‌ప‌ర్చాల‌ని అలా చేయ‌లేద‌ని ప‌వ‌న్ క్లారిటీ ఇచ్చారు.

కొద్దికాలం క్రితం కాకినాడ లో జరిగిన జనసేన సభలో మాట్లాడిన పవన్ గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ - బీజేపీ పార్టీలు కలిసి ప్రత్యేక హోదా క‌ల్పిస్తాం అని ప్ర‌క‌టించాయి. అయితే మూడు సంవత్సరాల తరువాత పాచిపోయిన లడ్డూ లాంటి ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌క‌టించాయి. పాచిపోయిన లడ్డూలను టీడీపీ స్వీకరిస్తుందా అంటూ నిల‌దీశాడు. ఆ నేప‌థ్యాన్ని పుర‌స్క‌రించుకొని తాజాగా విశాఖ‌ప‌ట్ట‌ణంలో జ‌రుగుతున్న కొవ్వొత్తుల ర్యాలీకి జ‌న‌సేన పార్టీ ప‌లు పాట‌లు విడుద‌ల చేసింది. డీజే పృద్వీ గ‌తంలో పవన్ సినిమాలోని కొన్ని పాటలను - బహిరంగ సభల్లోని కొన్ని డైలాగ్స్‌ ను మిక్స్ చేసి ఈ పాట‌ల‌ను సిద్ధం చేసి విడుద‌ల చేశారు. అయితే ఈ పాట‌లు త‌మ మ‌నోభావాల‌ను గాయ‌ప‌ర్చాయ‌ని కొంద‌రు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. పవన్ ప్రతీ సందర్భంలో పాచిపోయిన లడ్డూలని అంటున్నారని, పాటలో కూడా లడ్డూ అంటూ అవమానపరిచే విధంగా ఉందని కొందరు పవన్‌నూ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.ఇలా కొంద‌రి మ‌నోభావాలు దెబ్బ‌తిన్న విష‌యం ప‌వ‌న్ క‌ళ్యాణ్ దృష్టికి సైతం చేరింది. దీంతో ప‌వ‌న్ ఒకింత సుదీర్ఘంగానే వివ‌ర‌ణ ఇచ్చారు.

"ల‌డ్డూల మీద కాని, అవి అమ్మే వ్యాపారుల మీద కాని, వాటిని తినే వారి మీద కాని ఎలాంటి చులకన భావం లేదని జనసేన మనవి చేసుకుంటోంది. కానీ అడక్కుండా చేతిలో పాచిపోయిన లడ్డూలు పెట్టేవారి మీదే మాకున్న అసహనం అని గుర్తించాలని. ఇదే స‌మ‌యంలో లడ్డు తినడం ఆరోగ్యానికి హానికరం కాదు" అంటూ పవన్ స‌వివ‌ర‌ణ ట్వీట్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/