Begin typing your search above and press return to search.
జల్లికట్టు లోకి కోడి పందాల్ని లాగిన పవన్
By: Tupaki Desk | 20 Jan 2017 6:58 AM GMTతమిళనాట జల్లికట్టుపై ఆందోళనలు మిన్నంటుతున్న నేపథ్యంలో పవన్ ఈ అంశంపై ట్విట్టర్ ద్వారా పవర్ స్టార్ - జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పందించారు. ద్రవిడ సంస్కృతి - సమగ్రతను కేంద్రప్రభుత్వం దెబ్బతీస్తుందనిఅన్నారు. తాను తమిళనాడులోని పొల్లాచ్చిలో షూటింగ్ కు వెళ్లినపుడు సంప్రదాయక క్రీడల అంశంలో రాజకీయపరమైన జోక్యం ఎలా ఉంటుందో చూశానని పవన్ ట్వీట్ చేశారు. జలికట్టు క్రీడలో జంతువులకు గాయాలు కావడం, చనిపోవడం కంటే వ్యాపారం కోసం జరిగే పశువధలో ఎక్కువ జీవులు చనిపోతున్నాయి కదా అన్నాడు. భారత్ లో ఆవులు - గేదెలు - ఇతర పశువుల మాంసం కోసం ఏ స్థాయిలో చంపబడుతున్నాయో తెలియదా అని ప్రశ్నించారు. పశువులను చంపి సుమారు 2.4 మిలియన్ టన్నుల బీఫ్ ను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని పేర్కొంటూ ఇది జంతువులపై హింసకు పాల్పడినట్లు కాదా అని ప్రశ్నించారు.
'కేవలం జల్లికట్లు అంశంలోనే జంతు హింస గుర్తొస్తుందా? కంటికి కనిపించకుండా జరిగే మాంసం ఎగుమతి జంతు హింస కిందికి రాదా?'అని కేంద్రాన్ని పవన్ సూటిగా ప్రశ్నించారు. ప‌్రపంచంలోనే భారతదేశం అతి ఎక్కువగా బీప్ ఎగుమతి చేస్తోంది. ఆస్ట్రేలియా - బ్రెజిల్ కూడా మన తర్వాతి స్థానంలో ఉన్నాయి అని పవన్ తెలిపారు. కోడి పందాల అంశంపై కూడా పవన్ ట్వీట్ లో ప్రస్తావించారు. జల్లికట్టు - కోడి పందాలపై నిషేధం విధించడం దక్షిణ భారత సంస్కృతిపై దాడి చేయడమేనని మండిపడ్డారు. ఈ చర్య కేంద్ర ప్రభుత్వం ద్రావిడ సంస్కృతిపై కత్తిగట్టినట్లుగా భావించాల్సి వస్తోందని పవన్ విమర్శించారు. తనకు ప్రకృతి - జంతువులు - మాతృభూమిపై ఎంతో మమకారం - గౌరవం ఉందని పవన్ తెలిపారు. ఇందులో భాగంగానే తన ఫాం హౌస్ లో ప్రకృతి వ్యవసాయం స్పూర్తితో జీవామృతంతో సాగు చేస్తున్నట్లు వివరించారు. తన గోశాలలో 16 ఆవులు - గేదెలు - దూడలు ఉన్నట్లు పవన్ తెలిపారు. తన ట్వీట్ తో పాటుగా పవన్ ఆసక్తికరమైన ఫొటోలను జతపరిచారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/