Begin typing your search above and press return to search.
నెపోలియన్ ను ప్రస్తావిస్తూ..పవన్ ఫైరయ్యాడే
By: Tupaki Desk | 26 Dec 2017 6:47 PM GMTజనసేన అధినేత - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోమారు తెరమీదకు వచ్చారు. ఈ దఫా మళ్లీ కీలక అంశాన్ని ప్రస్తావించారు. కడపలోని ఫాతిమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజి విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిన సంగతి తెలిసిందే. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి లేకుండా గతేడాది సీట్లు భర్తీ చేయడంతో, ఇప్పుడు ఆ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఆ విద్యార్థులు ప్రభుత్వానికి విన్నవించారు, ఆందోళన బాటపట్టారు. అయినప్పటికీ వారి సమస్య పరిష్కారం కాలేదు.
ఈ నేపథ్యంలో ఫాతిమా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వరుస ట్వీట్లు చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కోరారు. ‘నెపోలియన్ ఒకసారి ఏం చెప్పారంటే ...మనం కోల్పోయే ప్రతీ గంటా భవిష్యత్‌ను దురదృష్టకరం చేసుకునేందుకు అవకాశం కల్పించడమే’ అని అన్నారు. కానీ, ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థుల జీవితాల్లో అది ముందే వచ్చేసింది. బాధ్యతారాహిత్యంతో, అనాలోచితంగా, అత్యాశ కలిగిన మేనేజ్‌మెంటే అందుకు కారణం` అని పవన్ ఫైర్ అయ్యారు. `విజ్ఞానవంతమైన విద్యార్థులు ఎంతో బాధతో చేసిన విన్నపాలను కేంద్ర, రాష్ట్రాలు గుర్తించకుండా కాలయాపన చేశాయి. ఫాతిమా మెడికల్ కళాశాల చేసినట్లు విదేశాల్లో జరిగితే భారీగా జరిమానా విధించడంతో పాటు, అనుమతులను కూడా రద్దు చేసి, మేనేజ్‌మెంట్‌ను జైలుకు పంపించేవాళ్లు’అని ట్వీట్స్ చేశారు. తద్వారా పరోక్షంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును తప్పుపట్టారు.
ఈ సందర్భంగా రాజకీయ ఆలోచనలను పవన్ తప్పుపట్టారు. మనదేశంలో సామాన్యులు, నిస్సహాయులపై వేగంగా పనిచేసే చట్టం.. అధికారం, అంగబలం ఉన్న వారి విషయంలో సమర్థంగా, వేగంగా పనిచేయలేకపోతుందని పవన్ అసహనం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల సన్నాహాల్లో పడి ప్రభుత్వాలు ప్రస్తుత విద్యావ్యవస్థ ప్రక్రియను, విద్యార్థుల భవిష్యత్‌ను పట్టించుకోవడం లేదని పవన్ మండిపడ్డారు. `గౌరవనీయులైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారికి ఇదే నా విన్నపం. ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థులు ఎంతో విలువైన సమయాన్ని డబ్బును ఇప్పటికే కోల్పోయారు. వారు స్వేదాన్ని - రక్తాన్ని చిందించి విద్యార్థుల చదువు కోసం ఫీజులు కట్టిన తల్లిదండ్రులకు ఇప్పుడు ఓదార్పు కావాలి. అయితే ఈ విషయంలో మేనేజ్‌మెంట్ నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తుంది. దయచేసి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడండి’ అని వరుసగా పవన్ కల్యాణ్ ట్వీట్ల వర్షాన్ని కురిపించారు. కాగా, పవన్ ట్వీట్లపై ప్రభుత్వం తరఫున ప్రకటన వెలువడాల్సి ఉంది.