Begin typing your search above and press return to search.

అప్పుల్లో పార్టీ అధినేత.. ఇక రాష్ట్ర అప్పు ఏం తీరుస్తావ్..

By:  Tupaki Desk   |   15 Feb 2020 11:30 PM GMT
అప్పుల్లో పార్టీ అధినేత.. ఇక రాష్ట్ర అప్పు ఏం తీరుస్తావ్..
X
సినీ జీవితం నుంచి రాజకీయంలోకి వచ్చి ఆరేళ్లకు పైగా అయ్యింది. ఆయన ఇన్నాళ్లు చేసిన, చేస్తున్న రాజకీయాలు ఎవరికీ అర్థం కానివి. ఆయన సినిమాలో చెప్పిన డైలాగ్ కు అనుగుణంగా అయిన చేస్తున్నారా అంటే అది లేదు. ఇష్టమొచ్చిన తీరులో రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న వ్యక్తి పవన్ కల్యాణ్. ఇప్పుడు మళ్లీ రాజకీయాల నుంచి సినిమా రంగంలోకి వెళ్లాడు. ప్రస్తుతం ఒక సినిమాలో నటిస్తున్నాడు. రాజకీయాల్లోకి వచ్చేముందు తాను ఇక సినిమాలు చేయనని చెప్పి ఇప్పుడు నాకు అప్పులు ఉన్నాయి.. వాటిని తీర్చుకోవడానికి సినిమాలు అవసరం అని చెబుతూ తన తర్వాతి సినిమాలను మొదలు పెట్టాడు.

ప్రశ్నించడమే తనతత్వం.. తప్పు చేస్తే ఎవరినైనా గల్లా పట్టి ప్రశ్నిస్తా.. మీరు కూడా ప్రశ్నిస్తా.. అని జనసేన పార్టీ పెట్టిన తొలినాళ్లల్లో యువతకు, ప్రజలకు పిలుపునిచ్చాడు. ఆయన బలంగా చెప్పిన ఆ మాటలే ఆయన పాటించలేదు. ఏనాడు తప్పును ప్రశ్నించకుండా కాలం వెళ్లదీశాడు. సందర్భోచితంగా మాట్లాడాల్సింది పోయి అవగాహన రాహిత్యమో.. ఒప్పందాల మహిమో తెలియదు కాదు. కానీ ఎప్పుడు నాన్ సింక్ పొలిటీషియన్ గా మారిపోయాడు. 2014 మార్చిలో పార్టీ వెంటనే ఎన్నికలు వచ్చాయి. అప్పుడు పెద్ద తప్పటడుగు వేశాడు. అప్పుడు టీడీపీ ఉన్న ఎన్డీఏలోకి వెళ్లాడు. వారికి సంపూర్ణ మద్దతు ఇచ్చి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నాడు. అప్పుడు పార్టీ పెట్టాడు కదా.. ప్రజలు అతడికే ఓటేసేందుకు మొగ్గు చూపారు. కానీ ఆయన ఆ సమయంలో ఏం ఆశించి.. ఏం తీసుకుని నాటి ఎన్నికలకు దూరంగా ఉన్నాడో ఆయనకే తెలియాలి. ఇప్పుడు 2019లో పోటీ చేసి ఘోర పరాభవం ఎదుర్కొన్నాడు. ఆ పార్టీ నుంచి గెలిచిన ఒక్క ఎమ్మెల్యే పవన్ ను చూసి కాదు అతడిని ఓటేశారు. అందుకే ఆ ఎమ్మెల్యే నాడు పవన్ కు మద్దతుగా నిలబడలేదు. అయితే ఈ ఆరేళ్లల్లో బాగా ఖర్చు చేశాడంట.. అందుకే ఇప్పుడు తాను అప్పుల పాలయ్యానని.. ఆ అప్పులు తీర్చుకునేందుకు తాను సినిమాలు చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించాడు.

ఆయన సినిమాలు చేయనని ప్రకటించిన వ్యక్తే తన మాటపై నిలబడకుంటే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆయన తీవ్ర అప్పుల్లో కూరుకుపోయి బయటపడలేని వ్యక్తివి లోటు బడ్జెట్ తో సతమతమవుతూ ఆర్థిక కష్టాలు పడుతున్న రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తావని? నీ అప్పులు తీర్చుకోలేనివాడివి.. రాష్ట్ర అప్పులు ఎలా తీరుస్తావని పలువురు ప్రశ్నిస్తున్నారు. ముందు ఇల్లు చక్క బెట్టుకుని తర్వాత రాష్ట్రం వైపు రావాలని సూచిస్తున్నారు.