Begin typing your search above and press return to search.

పవన్ అన్ని సినిమాలకు సైన్ చేయబోతున్నాడా!

By:  Tupaki Desk   |   29 April 2019 2:30 PM GMT
పవన్ అన్ని సినిమాలకు సైన్ చేయబోతున్నాడా!
X
మామూలే.. ఎన్నికల ముందు రాజకీయాలు అని అనడం, ఎన్నికలు అయ్యాకా మళ్లీ మొహం చాటేయడం. చాలా మంది సినిమా వాళ్లకు అలవాటే. మిగతా సినిమా వాళ్లు ఇలా ఎన్నికల ముందు రాజకీయం అంటూ మాత్రమే వస్తారు. మెగా ఫ్యామిలీ మాత్రం ఎన్నికల సమయం వస్తే ఏకంగా రాజకీయ పార్టీ అంటూ వస్తుంది. ఒక్కో ఎన్నికల ముందు వీళ్లు ఒక్కో గుర్తుకు ఓటేయమంటూ వస్తారు. ఎన్నికలు అయ్యాకా మళ్లీ సినిమాలు చేసుకొంటూ పోతారు! ఇదీ కథ.

ఇప్పటి వరకూ జరిగింది ఇదే. ఇక ముందు జరిగేది కూడా ఇదే అని మాట వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి - ఇంకా తన పార్టీ తరఫున అనేక మంది ని ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో దింపిన పవన్ కల్యాణ్ ఇంకా ఎన్నికల ఫలితాలు రాకముందే.. సినిమాలను ఒప్పుకునే పనిలో బిజీగా ఉన్నారట.

వాస్తవానికి పవన్ కల్యాణ్ ఈ ఎన్నికలకు ముందే కొన్ని సినిమాలకు కమిట్ అయ్యాడు. ఆ సినిమాలను ఇప్పుడు పూర్తి చేయనున్నాడు. తను కొందరు నిర్మాతలతో అడ్వాన్స్ తీసుకున్న వైనాన్ని పవన్ కల్యాణ్ ఎన్నికల అఫిడవిట్ లో అప్పులుగా పేర్కొన్నాడు.

ఆ సినిమాలను పూర్తి చేయడమే కాదట.. రాబోయే ఐదు సంవత్సరాలకూ తగిన స్థాయిలో పవన్ కల్యాణ్ సినిమాలను ఒప్పుకుంటున్నారని సమాచారం. రాబోయే ఐదేళ్లలో కనీసం ఐదు సినిమాలు చేసే ప్రణాళికలతో పవన్ ఉన్నారని, ఆ మేరకు అడ్వాన్స్ లు కూడా తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.

వచ్చే ఎన్నికల ముందు మళ్లీ హడావుడి చేయడమే అని, రాబోయే ఐదేళ్లు మాత్రం పవన్ సినిమాలతో బిజీ అయిపోతారని టాక్ వినిపిస్తోంది. మరి ఎన్నికల ముందు వచ్చి రాజకీయం అంటూ, మిగతా సమయం అంతా సినిమాలతో బిజీ అయిపోయే పవన్ ను జనాలు ఇక ఎలా తీసుకుంటారో! ఇలా చేస్తే పవన్ కల్యాణ్ ను ఇక రాజకీయంగా జనాలు నమ్ముతారా?