Begin typing your search above and press return to search.

జనసేన విలీనం పై స్పందించిన పవన్ కల్యాణ్!

By:  Tupaki Desk   |   4 Dec 2019 4:48 PM GMT
జనసేన విలీనం పై స్పందించిన పవన్ కల్యాణ్!
X
తన అన్నయ్య చిరంజీవి రూటులోనే నడుస్తున్నట్టుగా ఉన్నాడు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. ప్రజారాజ్యం పార్టీని పెట్టి, ముఖ్యమంత్రి పీఠాన్ని లక్ష్యంగా చేసుకుని అప్పట్లో చిరంజీవి భంగపడ్డారు. తను, కొంతమంది మాత్రమే ఎమ్మెల్యేలుగా నెగ్గగలిగారు.

అయితే పార్టీని నడిపేంత సమర్థత చిరంజీవికి లేకపోయింది. కాంగ్రెస్ లోకి విలీనం చేసి, ఎమ్మెల్యే పదవి కి కూడా రాజీనామా చేసి, రాజ్యసభ సభ్యత్వం ద్వారా చిరంజీవి కూల్ అయ్యారు. ఆ విలీనం తో చిరంజీవి పరువు పోయింది. రాజకీయంగా ఆయన చాప్టర్ అక్కడితో క్లోజ్ అయ్యింది.

కేంద్రం లో కాంగ్రెస్ అధికారం నుంచి చేజారాకా.. చిరంజీవి చేయగలిగింది ఏమీ లేకపోయింది. రాజ్యసభ సభ్యుడి గా కొనసాగి ఆ తర్వాత రాజకీయాల నుంచి వీడ్కోలు తీసుకున్నారు. ఇప్పటికీ రాజకీయ నేతగా చిరంజీవిది ఫెయిల్యూర్ స్టోరీనే.

దాదాపుగా పవన్ కల్యాణ్ కథ కూడా అలానే సాగుతూ ఉంది. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేస్తే, పవన్ కల్యాణ్ తన పార్టీని బీజేపీలోకి విలీనం చేసేలా కనిపిస్తూ ఉన్నాడు. ఎన్నో కబుర్లు చెప్పిన పవన్ కల్యాణ్ స్వయంగా ఇప్పుడు ఆ ఊహాగానాలకు అవకాశం ఇస్తున్నారు.

బీజేపీ వాళ్లు కూడా పవన్ కల్యాణ్ విలీన ప్రతిపాదనతో వస్తే ఓకే అనేస్తున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటించి వచ్చారు. ఆ తర్వాత రాయలసీమ పర్యటనకు వెళ్లారు. అక్కడ హిందుత్వ నేతలా కాసేపు, హిందుత్వను వ్యతిరేకిస్తూ కాసేపు మాట్లాడారు ఆయన.

ఈ క్రమంలో అమిత్ షాను పొగుడుతూ పవన్ చేసిన ప్రకటనతో.. జనసేన విలీనంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతిలో ప్రెస్ మీట్లో పవన్ కల్యాణ్ ఆసక్తి దాయకమైన వ్యాఖ్యలు చేశారు.

‘జనసేన బీజేపీ లోకి విలీనం అవుతుందా?’ అనే ప్రశ్నకు పవన్ స్పందిస్తూ.. ‘ఇప్పుడే ఏం చెప్పలేం..’ అని స్పందించినట్టుగా తెలుస్తోంది. విలీనం అనే కొశ్చన్ విన్నా పవన్ కల్యాణ్ ఎగెరిగిరి పడలేదు. తాపీగానే స్పందించారు. దీంతో ఆ పార్టీ విలీన ఊహాగానాలకు మరింత ఊతం లభిస్తోందని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.