Begin typing your search above and press return to search.
జనసేన సభలో ముద్రగడ బేనర్.. పవన్ కూల్ రియాక్షన్!
By: Tupaki Desk | 26 Jun 2023 10:04 AM GMTఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వారాహి యాత్ర ఆదివారంతో ముగిసింది. సుమారు 12 రోజులపాటు 8 నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగింది. ఇందులో భాగంగా కాకినాడలో జరిగిన జనసేన సభ.. ఏపీ రాజకీయాలను ఒక కుదుపుకుదిపిందనే చెప్పాలి. ఈ సభలో పవన్ పూనకాలు లోడింగ్ ప్రసంగం అనంతరం ముద్రగడ రియాక్షన్... కాపు సామాజికవర్గంలో కొత్త అలజడిని తెచ్చిందని అంటున్నారు.
ఈ సందర్భలో యువకులను అడ్డుపెట్టుకుని కొంతమంది నాయకులు తమ రాజకీయపబ్బం గడుపుకుంటున్నారంటూ పవన్ చేసిన ప్రసంగం ముద్రగడకు తగిలిందని అంటున్నారు. అనంతరం ముద్రగడ ఒక బహిరంగ లేఖ రాశారు. పవన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఈ లేఖపై పవన్ స్పందించలేదు కానీ... జనసైనికులు, పవన్ ఫ్యాన్స్ కొంతమంది మాత్రం ముద్రగడను బూతులుతిట్టడం, వల్గర్ గా మెసేజ్ లు పంపడం చేశారని ముద్రగడ ఆరోపించారు.
ఇదే సమయంలో పవన్ పై ఈ విషయాలను ప్రస్థావిస్తూ... మరో లేఖాస్త్రం సంధించారు ముద్రగడ. పిఠాపురంలో పోటీకి రమ్మని తనను పవన్ ఛాలెంజ్ చేయాలని ముద్రగడ ఆ లేఖలో కోరారు.
అయితే ఈ లేఖల్లో ఒకదానిపై కాకపోతే మరొకదానిపై అయినా పవన్ స్పందిస్తారని అంతా భావించారు. జనసైనికులు కూడా స్పందించాలని బలంగా కోరుకున్నారు. కారణం తెలియదు కానీ... పవన్ సైలెంటైపోయారు.
ఈ క్రమంలో తాజాగా రాజోలు నియోజకవర్గంలోని మలికిపురంలో జరిగిన బహిరంగ సభలో ఒక జనసైనికుడు ముద్రగడ పద్మనాభంకు వ్యతిరేకంగా ఉన్న బ్యానర్ పట్టుకుని కనిపించాడు. అది గమనించిన పవన్... తన ప్రసంగాన్ని ఆపి.. ఆ బేనర్ ను దించేయమని కోరాడు. పెద్దలు మనల్ని కొన్నిసార్లు కొన్ని మాటలు అంటారు.. అంతమాత్రాన వాళ్లను మనం ఏమీ అనకూడదు అంటూ పేరెత్తకుండానే తన అభిప్రాయాన్ని చెప్పారు.
దీంతో... ముద్రగడ విషయంలో పవన్ రియాక్షన్ ఏమిటనేది స్పష్టమయ్యిందని అంటున్నారు విశ్లేషకులు.