Begin typing your search above and press return to search.
పవన్ సడెన్ షో.. కారణమేంటో...!
By: Tupaki Desk | 29 Dec 2020 6:00 AM GMTరైతుల సమస్యలు, నష్టపరిహారాల విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కావాలనే పెద్ద డ్రామాలాడినట్లు అనుమానంగా ఉంది. మొన్నటి నవంబర్ లో నివర్ తుపాను వల్ల రైతులకు జరిగిన నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలంటు పవన్ ఒకటే గోల చేస్తున్నారు. అయితే జరిగిన పంట నష్టాలను అంచనా వేయటానికి, పరిహారం అందించేందుకు అధికారులు క్షేత్రస్ధాయిలో పర్యటనలు జరుపుతున్నట్లు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశంలోనే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.
జగన్ ప్రకటన ప్రకారం డిసెంబర్ 15వ తేదీలోగా అధికారులు తమ నివేదికలను ప్రభుత్వానికి అందించాలి. ఆ తర్వాత డిసెంబర్ 30వ తేదికి రైతులందరికీ పరిహారం అందుతుందని జగన్ చాలా స్పష్టంగా ప్రకటించారు. అసెంబ్లీలో చెప్పిన ప్రకారమే పరిహారం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఈ విషయం తెలిసిన తర్వాతే పవన్ కావాలనే పెద్ద షో చేసినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రైతు సమస్యలు, పరిహారం చెల్లింపు విషయంలో కృష్ణా జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చేపేరుతో పవన్ ఉయ్యూరు, గుడివాడ ప్రాంతాల్లో రోడ్డుషో చేసిన విషయం తెలిసిందే.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితి, వైఎస్సార్ రైతు భరోసా నిధులు విడుదల చేయటానికి ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేసేసింది. నివర్ తుపాను కారణంతో నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితి, వైఎస్సార్ రైతుభరోసా, పీఎం కిసాన్ మూడోవిడత నిధుల కోసం రూ. 1766 కోట్లను రెడీ చేసింది. రైతుభరోసా క్రింద 52 లక్షల రైతు కుటుంబాలకు రూ. 22 వేలు చొప్పున చెల్లించేందుకు రూ. 1120 కోట్లు కేటాయించింది.
అలాగే పీఎం కిసాన్ మూడో విడత చెల్లింపులను ప్రధానమంత్రి ఈనెల 25న విడుదల చేశారు. ఇప్పటికే కొందరు రైతుల ఖాతాల్లో రూ. 2 వేలు జమయ్యాయి. మిగిలిన రైతులకు రాష్ట్రప్రభుత్వం రైతుభరోసా పథకంలో రూ. 2 వేలు జమచేయబోతోంది. ఇక నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతుల కోసం రూ. 646 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. అధికారుల లెక్కల ప్రకారం 12 లక్షల ఎకరాల్లో పంటల నష్టం జరిగింది. దీనివల్ల 8.44 లక్షల మంది రైతులు నష్టపోయారు. వీరిని ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం రూ. 646 కోట్లను రెడీగా ఉంచింది.
పై మూడు పద్దతుల్లో రైతుల ఖాతాల్లో మంగళవారమే డబ్బులు జమయ్యేట్లుగా ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేసింది. ఈ విషయం తెలిసిన తర్వాతే పవన్ కావాలనే పెద్ద షో చేసినట్లు వైసీపీ నేతలంటున్నారు. నిజంగానే పవన్ కు రైతులపై అంతటి ప్రేమే ఉంటే నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు కేంద్రం నుండి రావాల్సిన పరిహారాన్ని ఎందుకు డిమాండ్ చేయటం లేదని నిలదీస్తున్నారు. అలాగే నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తు ఉద్యమం చేస్తున్న రైతుసంఘాలకు మద్దతుగా పవన్ ఎందుకు మాట్లాడటం లేదని అడుగుతున్న ప్రశ్నకు పవన్ సమాధానం ఇస్తారా ?