Begin typing your search above and press return to search.
పవన్ ఎవరిని టార్గెట్ చేశాడు?
By: Tupaki Desk | 28 Sept 2017 5:06 PM ISTగత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా అధికార పార్టీని లక్ష్యంగా చేసుకున్నాడు. ఆయన పర్టికులర్ గా ఎవరిని టార్గెట్ చేశారన్నది అర్థం కాలేదు కానీ.. అధికార పార్టీ నేతలపైనే ఆయన పరోక్ష విమర్శలు ఎక్కుపెట్టారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో భూ కబ్జాల్ని ఉద్దేశించి పవన్ విమర్శలు గుప్పించాడు.
కొందరి అత్యాశ వల్ల భూములు కబ్జా అవుతున్నాయని.. ఇప్పటికే వేల ఎకరాల భూముల్ని వాళ్లు సంపాదంచారని.. అయినా వారి ఆకలి ఎంతకూ తీరదని అన్నాడు పవన్. తన దృష్టి మాత్రం ప్రజల సమస్యల పరిష్కారం మీదే ఉందని పవన్ అన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డబుల్ గేమ్ నడుస్తోందని పవన్ వ్యాఖ్యానించాడు. ఓవైపు ఆంధ్రాకు ప్రత్యేక హోదా రాకుండా చేశారని.. మరోవైపు ఉద్యోగాలు పోతాయన్న బెదిరింపులూ నడుస్తున్నాయని పవన్ అన్నాడు.
ఒకట్రెండు గ్రామాల్ని దత్తత తీసుకున్నంత మాత్రాన సరిపోదని.. మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం జరగాలని పవన్ అన్నాడు. కొత్తగా ఉద్యోగాలు కల్పించాల్సింది పోయి ఉన్న ఉద్యోగాలు తీసుకెళ్లిపోతే.. ప్రజల్లో అశాంతి తప్పదని.. అలాంటి పరిస్థితి వస్తే ప్రజల తిరుగుబాటును ప్రభుత్వం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించాడు. మరి పవన్ తన వ్యాఖ్యలతో ఎవరిని లక్ష్యంగా చేసుకున్నాడో తెలియాల్సి ఉంది.