Begin typing your search above and press return to search.

మీడియా ఛాన‌ళ్ల‌కు ప‌వ‌న్ సూటి ప్ర‌శ్న‌లు

By:  Tupaki Desk   |   20 April 2018 6:39 AM GMT
మీడియా ఛాన‌ళ్ల‌కు ప‌వ‌న్ సూటి ప్ర‌శ్న‌లు
X
ఒక ప్ర‌ముఖుడిని ఉద్దేశించి.. ఆయ‌న త‌ల్లిని ప‌ట్టుకొని ఒక‌రు అన‌రాని మాట అన్న‌ప్పుడు మీడియా ఛాన‌ళ్లు ఏం చేస్తాయి? వీలైనంత‌వ‌ర‌కూ ఆ ఇష్యూను అక్క‌డితో వ‌దిలేస్తాయి. కాదంటే. దానినో న్యూస్ ఐటెంగా చూపిస్తాయి. నాకున్న పాత్రికేయ అనుభ‌వంతో చూసిన‌ప్పుడు వీలైనంత‌వ‌ర‌కూ ఆ విష‌యాన్ని అండ‌ర్ ప్లే చేసే ప్ర‌య‌త్నం చేస్తాయి త‌ప్పించి హ‌డావుడి చేయ‌వు.

ఎక్క‌డి దాకానో ఎందుకు? బాగా అర్థం కావాలంటే.. ఒక ముఖ్య‌మంత్రిని ప‌ట్టుకొని ఒక చిన్న‌పాటి ఉద్య‌మం చేసే వ్య‌క్తి అన‌రాని బూతుమాట అన్నార‌నుకోండి? దాన్ని టీవీ ఛాన‌ళ్లు ఎంత‌మేర చూపిస్తాయి? దానిపై పెద్ద ఎత్తున చ‌ర్చా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తాయి? అంటే లేదంటే లేద‌నే చెబుతారు. మ‌రి.. ప‌వ‌న్ క‌ల్యాణ్ విష‌యంలో ఎందుకంత ప్ర‌యారిటీ ఇస్తారు? ప‌వ‌న్ ను ఎవ‌రు తిట్టినా ప్ర‌త్యేక చ‌ర్చా కార్య‌క్ర‌మాల్ని ఎందుకు నిర్వ‌హిస్తారు? మ‌రింకేమీ స‌మ‌స్య‌లు లేన‌ట్లుగా.. అదే అంశాన్ని గంట‌ల త‌ర‌బ‌డి చ‌ర్చ‌లు ఎందుకు పెడ‌తారు? ప‌వ‌న్ వ్య‌క్తిత్వ హ‌నానం తీవ్ర‌స్థాయిలో సాగేలా ఎందుకు ప్ర‌య‌త్నిస్తారు? అన్న క్వ‌శ్చ‌న్లు చాలామందికి వ‌చ్చాయి. కానీ.. వీటికి ఏ మీడియా సంస్థా స‌మాధానం చెప్ప‌ని ప‌రిస్థితి.

అలాంటివేళ‌.. ప‌వ‌న్ క‌ల్యాణే స్వ‌యంగా రంగంలోకి దిగారు. త‌న త‌ల్లిని ఉద్దేశించి చేసిన అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌.. దాని వెనుక ఉన్న‌ది తానేనంటూ రాంగోపాల్ వ‌ర్మ స్వ‌యంగా బ‌య‌ట‌కు వ‌చ్చి వీడియో క్లిప్ లో చెప్ప‌టంతో ఈ ఇష్యూ మ‌రింత సీరియ‌స్ అయ్యింది. ఇలాంటి వేళ‌.. ప‌వ‌న్ గ‌త రాత్రి నుంచి వ‌రుస‌గా ట్వీట్లు చేస్తూ సంచ‌ల‌నం సృష్టిస్తున్నారు. త‌న‌పైన మీడియా అత్యాచారాన్ని ప్ర‌శ్నిస్తూ ఆయ‌న కొన్ని పోస్టులు పెట్టారు.

కొన్ని టీవీ ఛాన‌ళ్లు త‌న‌పై చేస్తున్న నిరంత‌ర మీడియా అత్యాచారాన్ని సూటిగా చెప్పేసిన ఆయ‌న‌.. మీడియా ఛాన‌ళ్ల ప్ర‌ముఖుల‌కు తాను కొన్ని ప్ర‌శ్న‌లు వేస్తున్నాన‌ని.. వాటికి స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా? అంటూ ప్ర‌శ్నించారు. ఆయ‌న ప్ర‌శ్న‌లు.. ఈ ఇష్యూను మ‌రింత సిరీయ‌స్ చేసేలా క‌నిపిస్తున్నాయి.

ప‌వ‌న్ సంధించిన ప్ర‌శ్న‌లు చూస్తే..

1. ఇదే త‌ర‌హాలో చంద్ర‌బాబును కానీ లోకేశ్ ను కానీ ఎవ‌రైనా అస‌భ్య‌క‌రంగా తిడితే ఇదే రీతిలో టెలికాస్ట్ చేస్తారా? ఆ ధైర్యం మీకుందా?

2. ప్ర‌తిప‌క్ష నేత‌పై ఇదే రీతిలో అస‌భ్య ప‌ద‌జాలాన్ని వాడితే దాన్ని ఇదే రీతిలో టెలికాస్ట్ చేస్తారా?

3. ఇదే రీతీలో అస‌భ్య ప‌ద‌జాలాన్ని బాల‌కృష్ణ‌ను ఉద్దేశించి చేస్తే.. మీరిట్లానే చ‌ర్చా వేదిక‌లు నిర్వ‌హిస్తారా?

కానీ.. ప‌వ‌న్ క‌ల్యాణ్ విష‌యంలో మాత్రం మీరిలా చేస్తారు. ప‌వ‌న్ త‌ల్లి విష‌యంలో అస‌భ్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేస్తే మాత్రం వాటిని టెలికాస్ట్ చేయ‌ట‌మే కాదు.. వాటిపై విశ్లేష‌ణ‌లు.. డిబేట్లు నిర్వ‌హిస్తుంటారు. సంప‌న్న‌.. శ‌క్తివంత‌మైన మీడియా ఛాన‌ళ్ల య‌జ‌మానులారా ఎందుకు నాకు.. నా త‌ల్లికే ఈ ప్ర‌త్యేక‌.. ఎక్స్ క్లూజివ్ ట్రీట్ మెంట్‌? స‌మాధానం చెబుతారా?