Begin typing your search above and press return to search.

పవన్ ప్రశ్నలకు బాబు సమాధానం చెప్పగలరా?

By:  Tupaki Desk   |   27 Jan 2017 7:10 AM GMT
పవన్ ప్రశ్నలకు బాబు సమాధానం చెప్పగలరా?
X
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు తన విశ్వరూపం చూపించారు. ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానంటూ చెప్పి ఇంతకాలం చంద్రబాబు, బీజేపీల విషయంలో గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్న ఆయన ఈసారి పులిలా విరుచుకుపడ్డారు. ముసుగులో గుద్దులాట మానేసి చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. బీజేపీ అంటే ఎందుకు భయపడుతున్నావని అడిగారు.. ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడం వల్లే కదా రాజీపడిపోయావు అన్నట్లుగా ఇరుకునపెట్టారు. అమరావతిని ఎలా నిర్మిస్తారో చెప్పాలని కూడా ప్రశ్నించారు. మొత్తానికి పవన్ కాస్త లేటుగా అయినా అన్నీగట్టి ప్రశ్నలే సంధించారు. మరి.. దీనికి చంద్రబాబు ఎలా సమాధానం చెబుతారో చూడాలి..?

పవన్ అడిగిన ప్రశ్నలివే...

- రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించడంలో ఎందుకు కాంప్రమైజ్ అయ్యారో నాకు చెప్పండి.

- ఏ బేసిస్ లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు? మిమ్మల్ని ఎవరు కాంప్రమైజ్ కావాలని చెప్పారో చెప్పండి. నాకు కాదు... మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ?
- ప్రజలకు ఇదంతా చెప్పలేనప్పుడు రాజధానిని ఎలా నిర్మిస్తారు?

- ప్రత్యేక హోదా అంశాన్ని పక్కనబెట్టి, ప్రత్యేక ప్యాకేజీ చాలని పదేపదే చెబుతూ, ప్రజలను మభ్య పెట్టాలని ఎందుకు చూస్తున్నారో వెంటనే తెలియజేయాలి?

- నోట్ల రద్దుకు చంద్రబాబు మద్దతు పలికారని గుర్తు చేస్తూ, ఆపై ఇబ్బందులు ఉన్నాయని, నోట్ల రద్దుతో నష్టమేనని చెబుతూ ఐదు సార్లు మాటలు మార్చారని చెప్పారు. ఇంత అనుభవమున్న మీరే ఇన్నిసార్లు మాటలు మారుస్తుంటే, ప్రత్యేక హోదాపైనా మీరు మాట మార్చారని ఎందుకు అనుకోకూడు?

- ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించక పోవడం చంద్రబాబు చేస్తున్న తప్పు. దాన్ని సరిదిద్దుకోవాలి. ఆ పని ఎప్పుడు చేస్తారు?

- సుజనా వంటి వ్యక్తులను పక్కనెందుకు పెట్టుకున్నారు?

అంటూ పవన్ చంద్రబాబును ఉద్దేశించి నేరుగా ప్రశ్నలు సంధించారు.