Begin typing your search above and press return to search.
ఏమైంది బాబూ నీ అనుభవం - పవన్
By: Tupaki Desk | 22 May 2018 4:52 PM GMTజగన్ ఖాతాలోకి వెళ్లిన ప్రత్యేక హోదా నినాదాన్ని ఎలాగైనా తమ పరం చేసుకోవడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ - టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేయని ప్రయత్నాలు లేవు. ఒక ధర్మపోరాట దీక్ష అంటే - మరొకరు హోదా కవాతు అంటున్నారు. కానీ వారి ప్రయత్నాలన్నీ తేలిపోతున్నాయి. నిజానికి ప్రత్యేక హోదా అనే పదం ఇంకా ఏపీలో వినపడుతోంది అంటే దానికి ఏకైక కారణం వైఎస్ జగనే. అయితే, ఈరోజు బాబు వైజాగ్ లో హోదా జపం చేస్తుండగా, పవన్ పలాసలో కవాతు చేశారు. ఈ సందర్భంగా పవన్ తన మాజీ పార్టనర్ తెలుగుదేశాన్ని కడిగి పారేశారు. పాయింట్ బై పాయింట్ పవన్ వేసిన ప్రతి ప్రశ్నలోనూ పవన్ ఆరోజు జనాలకు ఇచ్చిన గ్యారంటీ గుర్తుతెచ్చుకునే పరిస్థితి. తెలుగుదేశం తాను నమ్మిన బంటు తమకే భస్మాసుర హస్తంగా మారగా, పవన్ తాను చెప్పిన మాటలే తనకు తలనొప్పిగా మారి ఇరకాటంలో పడుతున్నారు. ఇదే విషయమై మొన్న ఓ మహిళ పవన్ కు 2014లో టీడీపీ తరఫున ఇచ్చిన గ్యారంటీని గుర్తుచేసి కడిగేసింది. పవన్‌కు నోట మాట రాలేదు. తాజాగా పవన్ కళ్యాణ్ టీడీపీపై చేసిన దాడిని చూద్దాం.
* బాబూ... 2014లో మీరు మా వద్దకు వచ్చారా? మేము మీ వద్దకు వచ్చామా? గుర్తుచేసుకోండి.
* జనసేన వల్లే ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది దీనికి ప్రజలే సాక్షి. మిమ్మల్ని మోసే పత్రికలే ఆధారం.
* 40 ఏళ్ళ అనుభవం ఉందని మీరే చెబుతున్నారు.. ప్రజా సమస్యలను పరిష్కరించలేని ఆ అనుభవం ఎందుకు?
* చట్టసభల్లో కూర్చొన్న నేతలు అధికారం చేపట్టాక తమ ప్రయోజనాలను కాపాడుకొంటున్నారు.
* చంద్రబాబునాయుడు బిజెపిని ఎందుకు నిలదీయటం లేదు?
2014లో టీడీపీ-బీజేపీలకు మద్దతు ఇచ్చానని - వారు సరిగా పాలన చేయకపోతే ప్రశ్నిస్తానని ప్రజలకు హామీ ఇచ్చానని... అందుకే తాను ప్రజలతో కలిసి తిరుగుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. రాష్ట్ర - కేంద్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హమీలను విస్మరించాయని ఆయన విమర్శలు గుప్పించారు.
2019లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అని మరోసారి ఆయన కాశీబుగ్గ పర్యటనలో చెప్పారు. ప్రజల కన్నీరు తుడవని అధికారం ఎందుకని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే ప్రజల కన్నీళ్ళు రాకుండా చేస్తామని చెప్పారు. అయితే, పవన్ యాత్రలో అడుగడుగునా ఎండకు తాళలేక విశ్రాంతి తీసుకోవడంపై జనం సెటైర్లు వేస్తున్నారు. సాధారణంగా అయితే పట్టించుకునే వారు కాదు గాని ఒకవైపు వైఎస్ జగన్ ఎండలో కొంచెం కూడా రెస్టు లేకుండా తిరుగుతుంటే పవన్ ఒకటి రెండు రోజులకే అలసిపోతుండటం జనసేన కార్యకర్తలను నిరాశకు గురిచేస్తోందట.