Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ క్వ‌శ్చ‌న్‌!... బాబూ ఈ నాన్చుడేందీ?

By:  Tupaki Desk   |   2 Sep 2017 2:20 PM GMT
ప‌వ‌న్ క్వ‌శ్చ‌న్‌!... బాబూ ఈ నాన్చుడేందీ?
X
టాలీవుడ్ అగ్ర‌న‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌... టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుకు మ‌రోమారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నేడు త‌న జ‌న్మ‌దిన‌మైనా కూడా దానికి అంత‌గా ప్రాధాన్య‌మివ్వ‌ని ప‌వ‌న్‌.. య‌ధావిధిగా త‌న దిన‌స‌రి కార్య‌క‌లాపాల్లో మునిగిపోయారు. ఈ క్ర‌మంలో త‌న పార్టీకి చెందిన సోష‌ల్ మీడియా టీంతో స‌మావేశం నిర్వ‌హించిన ప‌వ‌న్‌... ఈ సంద‌ర్భంగా కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇస్తామ‌న్న టీడీపీ ఎన్నిక‌ల వాగ్దానాన్ని ప్ర‌స్తావించారు. ఓట్లేస్తే.. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తామ‌న్న హామీని టీడీపీ స‌ర్కారు నిల‌బెట్టుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

కాపు రిజర్వేషన్ల హామీ కూడా ప్రత్యేక హోదా లాంటిదేనని ప‌వ‌న్‌ అన్నారు. ఆలస్యం చేయకుండా ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే నెర‌వేర్చాలని పవన్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్ర‌జ‌ల‌ను మభ్యపెట్టాల‌ని చూస్తే... అది అశాంతికి కారణమవుతుందని కూడా ప‌వ‌న్ కల్యాణ్ కాస్తంత గ‌ట్టిగానే హెచ్చరించారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తే ఇవ్వండి... లేదంటే ఇవ్వలేమని తేల్చి చెప్పాలని ఆయ‌న చంద్ర‌బాబు స‌ర్కారుకు సూచించారు. ఇప్ప‌టిదాకా ఈ అంశాన్ని తేల్చ‌కుండానే సాగ‌దీస్తూ వ‌చ్చార‌ని, ఇక‌పై నాన్చుడు దోరణి సరికాదని అన్నారు. తాను ఒక కులం కోసం పనిచేయనని, ప్రతి కులాన్ని గౌరవిస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న ముద్రగడ పద్మనాభం పాదయాత్రను ఆపే హక్కు పోలీసులకు, ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ముద్రగడను అడ్డుకోవడం శాంతి భద్రతల సమస్యగా మారుతుందని కూడా ప‌వ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. బీఆర్ అంబేద్కర్ రిజర్వేషన్లు లేని సమాజం కావాలని కోరుకున్నారని పవన్ ఈ సందర్భంగా చెప్పారు. అందరికీ సమాన హక్కులు కావాలని ఆయన ఆకాంక్షించారని పవన్ తెలిపారు. త‌న త‌ల్లి బీసీ(బలిజ) అని, తండ్రి అగ్ర కులానికి చెందిన వార‌ని, ఈ క్ర‌మంలో త‌ల్లి కులం పెట్టుకుని రిజర్వేషన్లు పొందే అవ‌కాశాలు త‌మ‌కూ ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పారు. ఈ కార‌ణంగానే క్రిమీలేయర్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు.