Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ఎంపీలు క‌మాండింగ్ జాబ్ చేశార‌న్న ప‌వ‌న్‌

By:  Tupaki Desk   |   13 April 2017 4:54 AM GMT
జ‌గ‌న్ ఎంపీలు క‌మాండింగ్ జాబ్ చేశార‌న్న ప‌వ‌న్‌
X
ప్ర‌త్యేక హోదా అంశంపై ఏపీ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం మొద‌టి నుంచి పోరాడుతున్న ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీల తీరును జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పొగిడేశారు. రెండు రోజుల క్రితం ఏపీ ప్ర‌త్యేక హోదా మీద రాజ్య‌స‌భ‌లో జ‌రిగిన చ‌ర్చ‌లో.. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చేది లేద‌న్న విష‌యాన్ని కేంద్రం తేల్చి చెప్పిన అంశాన్ని ప్ర‌స్తావించిన ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఈ చ‌ర్చ‌లో ఏపీ అధికార‌ప‌క్ష నేత‌లు స‌భ‌కు హాజ‌రు కాక‌పోవ‌టాన్ని ప్ర‌శ్నించారు. ప్ర‌త్యేక హోదా అంశంపై రాజ్య‌స‌భ‌లో జ‌రిగిన చ‌ర్చ‌పై ప‌వ‌న్ ట్విట్ట‌ర్ ద్వారా ప‌లు ట్వీట్లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌.. కేంద్ర‌మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు మౌనంగా ఉండ‌టాన్ని ప్ర‌శ్నించారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌త్యేక హోదా మీద టీడీపీ.. బీజేపీ క‌లిసి ఏపీ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీని విస్మ‌రించిన టీడీపీ ఎంపీల్ని త‌ప్పు ప‌ట్టారు. రాజ్య‌స‌భ‌లో చ‌ర్చ జ‌రుగుతున‌న స‌మ‌యంలో టీడీపీ ఎంపీలు ఎందుకు హాజ‌రు కాలేద‌న్న విష‌యాన్ని ప్ర‌శ్నించిన ప‌వ‌న్‌.. ఏపీ ప్ర‌త్యేక హోదా సాధ‌న విష‌యంలో రాజీ ప‌డ‌టం ఏ మాత్రం స‌రికాదన్నారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక హోదా అంశంపై పార్ల‌మెంటులో జ‌రిగిన చ‌ర్చ‌లో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు క‌మాండింగ్ జాబ్ చేశారంటూ అభినందించిన ఆయ‌న‌.. ఏపీ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల గురించి ప్ర‌స్తావించిన తెలంగాణ ఎంపీలు కేకే.. రాప్రోలు ఆనంద్‌ భాస్క‌ర్‌ ను అభినందించారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాలంటూ వారు మ‌ద్ద‌తు ప‌లికిన వైనాన్ని ప్ర‌శంసించారు.

వైఎస్సార్ కాంగ్రెస్‌.. తెలంగాణ ఎంపీల్ని అభినందించిన ప‌వ‌న్‌.. ఏపీ టీడీపీ ఎంపీల వైఖ‌రిని తీవ్రంగా త‌ప్పు ప‌ట్ట‌ట‌మే కాదు.. వారికి చుర‌క‌లు అంటించే ప్ర‌య‌త్నం చేశారు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఉత్త‌రాది ఎంపీల చేతిలో దెబ్బలు తిన్న అవ‌మాన‌క‌ర‌మైన అంశాల్ని టీడీపీ ఎంపీలు బ‌హుశా మ‌ర్చిపోయి ఉంటార‌ని వ్యాఖ్యానించారు. వ్య‌క్తిగ‌త లాభాల కోసం ఏపీ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల్ని.. ఏపీ ప్ర‌జ‌ల ఆత్మాభిమానాన్ని తాక‌ట్టు పెట్టేలా ఏపీ టీడీపీ ఎంపీలు వ్య‌వ‌హ‌రించొద్దంటూ మండిప‌డ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/