Begin typing your search above and press return to search.
పవన్ పాఠం:బాబూ..కేసీఆర్ ను చూసి నేర్చుకో!
By: Tupaki Desk | 2 Jan 2018 4:26 AM GMTఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు - జనసేన అధినేత - పవన్ కల్యాన్ ఇండైరక్టుగా పాఠం చెబుతున్నారు. రైతు సంక్షేమం కోసం పనిచేయడం అంటే ఎలాగో కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలి అన్నట్లుగా ఆయన బోధిస్తున్నారు. రైతులకోసం ఉచిత విద్యుత్తును నిరంతరాయంగా రోజుకు 24 గంటల పాటూ సరఫరా చేసే పథకాన్ని కొత్త సంవత్సరం కానుకగా .... కేసీఆర్ సర్కారు ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలాంటి అద్భుతమైన నిర్ణయం తీసుకున్నందుకు కేసీఆర్ ను వ్యక్తిగతంగా కలిసి అభినందించిన పవన్ కల్యాణ్.. రైతుల కోసం ఇలాంటి పథకం దేశం మొత్తానికి ఆదర్శం కావాలంటూ అభిలషించారు. తెలంగాణ ప్రభుత్వం పథకాలను పాలనా తీరును ఏపీలో కూడా అమలు చేయాలంటూ పవన్ కల్యాణ్ హితవు చెప్పేశారు.
ప్రపంచంలో తనను మించిన ప్రజారంజకమైన పరిపాలన అందించే మహనీయుడు మరొక్కడు లేరని భావిస్తూ ఉండే , ప్రచారం చేసుకుంటూ ఉండే చంద్రబాబునాయుడుకు బహుశా... పవన్ కల్యాణ్ తాజా వైఖరి కంటగింపుగా ఉండవచ్చు. ఎందుకంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయనకు రాజకీయ ప్రత్యర్థి. తెలంగాణ లో కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడడం గురించి ఆయన తన పార్టీ శ్రేణులకు ఏదో గుర్తొచ్చినప్పుడు కాస్త కీ ఇచ్చి ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటిది.. ఏపీలో తన ప్రభుత్వం బాగా పనిచేస్తున్నదని - రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కష్టపడుతున్నదని చెప్పిన పవన్ కల్యాణే ఇప్పుడు కేసీఆర్ ఇంట్లో కూర్చుని.. కేసీఆర్ ను చూసి చంద్రబాబు పరిపాలన నేర్చుకోవాలని అనేయడం.. చంద్రబాబుకు మింగుడుపడకపోవచ్చు.
యూత్ లో ప్రజాదరణ ఉన్న హీరోగా పవన్ కల్యాణ్ కు గుర్తింపు ఉంది. ఆయన తన ప్రభుత్వం గురించి సానుకూలంగా మాత్రమే మాట్లాడేలా నిత్యం ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తూ ఉంటారు. పవన్ కల్యాణ్ – చంద్రబాబు మినహా మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎడా పెడా సెటైర్లు వేసినా.. తమ పార్టీ వారి ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత నాయకుడిగా తన మీద ఉన్నదనే సంగతిని కూడా విస్మరించి.. పవన్ విషయంలో అతిగా ప్రతిస్పందించ వద్దని.. మిత్రుల వ్యాఖ్యల పట్ల సంయమనంతో వ్యవహరించాలని ఆయన సొంత పార్టీ వారికే క్లాసులు పీకుతుంటారు. ఇన్ని చేస్తున్నప్పటికీ.. వాస్తవంలో పవన్ వద్ద ఆయనకు పెద్దగా మార్కులు పడలేదని తాజా పరిణామంతో అర్థమైపోతోంది. కేసీఆర్ పరిపాలన యావత్ దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఒక కేస్ స్టడీ లాగా ఉంటున్నాయని, అందరూ ఇక్కడ అధ్యయనం చేయాలని పవన్ కల్యాణ్ అనడం లాంటి వ్యాఖ్యల్ని చంద్రబాబునాయుడు ఎలా స్వీకరిస్తారో.. రైతులకోసం ఏం చేయడానికి ఉపక్రమిస్తారో... సంయమనం వీడకుండా ఎలా ప్రతిస్పందిస్తారో చూడాలి.