Begin typing your search above and press return to search.
పవన్ కు 2014లో ఊహించని గౌరవం.. 2019లో ఊహకందని పరాభవం
By: Tupaki Desk | 29 May 2019 5:34 PM GMTసరిగ్గా అయిదేళ్ల కిందట.. 2014లో మోదీ ప్రమాణ స్వీకారం. అప్పటికి ఒక్క ఎంపీ సీటు కానీ - ఎమ్మెల్యే సీటు కానీ లేని.. అసలు దేశంలో సగానికి పైగా రాష్ట్రాల్లో ఎన్నడూ పేరు కూడా తెలియని పార్టీ - ఆ పార్టీకి చెందిన నేతను మోదీ తన ప్రమాణ స్వీకారానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. అందుకు కారణం.. ఆ పార్టీ ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయకపోయినా బీజేపీకి మద్దతిచ్చి ప్రచారం చేయడంతో ఏపీలో బీజేపీ - టీడీపీల ప్రభుత్వం ఏర్పడడంతో పాటు చెప్పుకోదగ్గ సంఖ్యలో పార్లమెంటు స్థానాలు కూడా వచ్చాయి. అలా మోదీకి సహకరించి.. ప్రత్యేక ఆహ్వానం అందుకున్న ఆ నాయకుడు పవన్ కల్యాణ్.
కానీ, అయిదేళ్లు తిరిగి 2019 వచ్చేసరికి పవన్ కల్యాణ్ మోదీ మనసులోంచి ఎగిరిపోయారు. పవన్ సొంతంగా పోటీచేయడం.. బీజేపీపైనా విమర్శలు గుప్పించడం.. తాను సొంతంగా పోటీచేసినా గెలవలేకపోవడం.. తన పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో మోదీకి పవన్ అవసరమే లేకుండా పోయింది. దీంతో పవన్ కల్యాణ్ కు మోదీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం దక్కలేదు.
2014 ఎన్నికల్లో టీడీపీ - బీజేపీల విజయానికి దోహదపడిన జనసేన - ఆ పార్టీ అధినేత పవన్ 2019 ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసి సీఎం సీటుపై కన్నేశారు. కానీ... ఆయన ఆశలకు - వాస్తవాలకు ఏమాత్రం పొంతన కుదరలేదు. జనం ఆయన సభలకు తండోపతండాలుగా వచ్చారే కానీ ఓట్లు మాత్రం వేయలేదు. చివరకు ఆయన రెండు సీట్లలో పోటీ చేసినా ఒక్క చోట కూడా గెలవలేకపోయారు.
దీంతో పవన్ కల్యాణ్ రసాయశాస్త్రంలో ఉత్ప్రేరకం(కెటలిస్ట్)గా పనిచేయగలరే కానీ సొంతంగా రసాయన చర్యలో ఈక్వేషన్స్ మార్చలేరని తేలిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో గత ఎన్నికల కంటే కూడా బలం భారీగా పెంచుకున్న మోదీ 2014కి మించిన ఉత్సాహంతో ప్రధాని సీట్లో కూర్చునేందుకు వెళ్తున్న వేళ పవన్ లాంటి వారిని పూర్తిగా పక్కన పెట్టేసినట్లేనని బీజేపీ నేతలే అంటున్నారు. ఇకపై తాము ఏపీలో ఏం చేసినా సొంతంగానే చేస్తామని.. ఎవరి అవసరం ఉండదని చెబుతున్నారు.