Begin typing your search above and press return to search.
పవన్ కళ్యాణ్ ఇక కోల్డ్ స్టోరేజ్ కేనా?
By: Tupaki Desk | 15 Dec 2020 12:30 PM GMTఆటలో అరటిపండుగా పవన్ కళ్యాణ్ ను మార్చాలని బీజేపీ చూస్తోందా..? మిత్రుడిగా చేర్చుకొని సీట్లు ఇవ్వకుండా మద్దతు తీసుకుంటూ జనసేనను నిర్వీర్యం చేసే పనిలో పడిందా? పవన్ ను కోల్డ్ స్టోరేజీలోకి పంపేలా బీజేపీ స్కెచ్ గీసిందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే అనిపిస్తోందని జనసైనికుల్లో తీవ్ర చర్చ జరుగుతోందట.. బీజేపీ వ్యూహాలు చూశాక విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు సినిమా తెరపై తిరుగులేని స్టార్ హీరో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడమే ఒక సంచలనం.. అయితే రాజకీయ యవనికపై ఆయన యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా పార్ట్ టైం పాలిటిక్స్ చేయడం మొదలు పెట్టాక రాజకీయంగా ఎదురుదెబ్బలు తగిలాయి. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ నిలకడ లేని స్టేట్ మెంట్లు మరియు రాజకీయ ఆలోచనలు అన్ని బెడిసికొట్టాయని ఎవరిని అడిగినా చెప్తారు.
ప్రజారాజ్యంలో పవన్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్లను పంచెలూడదీసి కొట్లాలి అన్న డైలాగ్ బాగా పేలింది. అయితే అదే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో చిరంజీవి కలిపేయడంతో వీరిద్దరి విశ్వసనీయత కోల్పోయినట్టైంది.
చాలా రోజుల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీని స్థాపించాడు. 2014 ఎన్నికల్లో చంద్రబాబుకి మద్దతు ఇచ్చి ఎన్నికల్లో పోటీ పెట్టకుండా గమ్మున ఉండడంతో జనసేన కేడర్ అంతా చెల్లా చెదురు అయిపోయింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ పెట్టి ఒకే ఒక్క సీటును గెలిచి స్వయంగా రెండు చోట్ల పోటీచేసిన పవన్ కళ్యాణ్ సైతం దారుణంగా ఓడిపోయిన పరిస్థితిని చూశాం.
అయితే ఇదే పవన్ కళ్యాణ్... 2019 ఎన్నికలకు ముందు బీజేపీని తీవ్రంగా విమర్శించాడు. ‘పాచిపోయిన లడ్డూలు’ ఏపీకి పరిహారంగా ఇస్తారా? అని ఎగతాళి చేశాడు. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీని కడిగిపారేశాడు. మళ్లీ ఇప్పుడు బీజేపీతో కలిసి నడుస్తానని అంటున్నాడు.
కానీ బీజేపీ మాత్రం పవన్ పై నమ్మకం ఉంచడం లేదు. పవన్ నాయకత్వం స్థిరంగా లేదు కాబట్టి ఆయనను రాజకీయంగా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టాలని ఆలోచన చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేయకుండా ఇదివరకే పవన్ ను బీజేపీ నియంత్రించింది. మళ్లీ తిరుపతి ఉప ఎన్నికల్లోనూ జనసేనకు సీటు లేకుండా బీజేపీనే పోటీచేసే విధంగా చేస్తున్నారంట..
ఇలా అయితే రాబోయే రోజుల్లో బీజేపీ.. జనసేనను, పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా కోల్డ్ స్టోరేజ్ పెట్టడం ఖాయం అని ఎవరిని అడిగినా చెప్తున్నారు. ఇప్పుడు ఇదే జనసైనికుల్లో తీవ్ర చర్చకు, ఆందోళనకు కారణమవుతోందట..