Begin typing your search above and press return to search.

జ‌న‌సేన‌కు కిక్ ఇచ్చే నిర్ణ‌యం తీసుకున్న ప‌వ‌న్‌

By:  Tupaki Desk   |   30 March 2018 5:10 PM GMT
జ‌న‌సేన‌కు కిక్ ఇచ్చే నిర్ణ‌యం తీసుకున్న ప‌వ‌న్‌
X
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తన పార్టీని బ‌లోపేతం చేసే దూకుడును మ‌రింత పెంచుతున్నారు. హైద‌రాబాద్ కేంద్రంగా పార్టీ కార్య‌క‌లాపాల‌ను వేగ‌వంతం చేయ‌డం - ఏపీలో నూత‌న కార్యాల‌యం ఏర్పాటు ఇప్ప‌టికే పార్టీపై దృష్టి సారించిన ప‌వ‌న్ తాజాగా పార్టీ శ్రేణుల‌కు ఉత్సాహం క‌లిగించే నిర్ణ‌యం తీసుకున్నారు. జనసేన జిల్లా కమిటీల నియామకానికి రోడ్ మ్యాప్ రూపొందించారు. ఇందులో భాగంగా ప్రెసిడెంట్ క‌మిటీ పేరుతో కొత్త క‌మిటీ పేరుతో జనసేన జిల్లాల కమిటీల నియామకం - పార్టీని విస్తృత పరచడం - మేనిఫెస్టో రూపకల్పనపై జనసేన అధినేత పవన్ క‌ళ్యాణ్ మేధావులు - వివిధ వర్గాల వారు - కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ సంస్థ నుంచి పవన్ క‌ళ్యాణ్ అనుసరిస్తున్నవారు - గత నాలుగేళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న వారిని కలిసి చర్చిస్తున్నారని పార్టీ తెలిపింది.

జ‌న‌సేన వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం గతవారం రోజులుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాల్లో కమిటీల నియామకానికి ప్రతి జిల్లాకు ఒక బృందాన్ని ఏర్పాటుచేస్తున్నారు. ఈ టీంలో జిల్లా విస్తీర్ణాన్ని బట్టి 20నుంచి25 మంది సభ్యులుగా ఆ జిల్లాకు చెందిన వారు ఉంటారు. వీరు కేంద్ర కార్యాలయానికి చెందిన ఇద్దరు సభ్యులతో కలిసి ఎంపికలు చేస్తారు. వీరిని ప్రెసిడెంట్ టీంగా వ్యవహరిస్తారు. కమిటీల నియామకం పూర్తిగా ప్రెసిడెంట్ టీం పర్యవేక్షిస్తుంది. వివిధ రంగాలలోని ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, కవులు కళాకారులు, వివిధ సంఘాల ప్రతినిధులు, సేవాతత్పరులు, అధికార అనధికార ప్రముఖులను కలసి కమిటీల ఏర్పాటులో వారి సలహాలు, సూచనలను సేకరిస్తారు. ప్రజామోదం పొందిన వ్యక్తులను కమిటీలో నియమించే విధంగా చర్యలు చేపట్టాలని పార్టీ అధ్యక్షుడు జిల్లా బాధ్యులకు ఆదేశాలు జారీచేశారు. జిల్లాల్లో విస్తృతంగా పర్యటనలు జరిపిన అనంతరం కమిటీల్లో నియామకానికి అర్హతలు గల వారిని ప్రెసిడెంట్ గుర్తించి కేంద్ర కార్యాలయానికి ఒక నివేదికతో పాటు జాబితా సమర్పిస్తుంది. ఈ జాబితా ఆధారంగా ప్రెసిడెంట్ కమిటీలకు రూపకల్పన చేసి పార్టీ అధ్యక్షుని ఆమోదానికి పంపుతుంది. తూర్పుగోదావరి, అనంతపురం టీంలు ఇప్పటికే కమిటీల నియామకాల ప్రక్రియను ప్రారంభించాయి.

ఇదిలాఉండ‌గా...ప్రముఖులతో భేటీ విశాఖపట్నం - విజయవాడ ప్రాంతాలకు చెందిన కొందరు ప్రముఖులు శుక్రవారం పార్టీ కార్యాలయంలో పవన్ క‌ళ్యాణ్‌ను కలిసి వివిధ అంశాలపై చర్చించారు. పార్టీ విధివిధానాలు - ప్రజాసమస్యల పరిష్కారానికి ఏవిధంగా ముందుకెళ్లాలి - పార్టీ మేనిఫెస్టోలో ఎటువంటి అంశాలను కోరుకుంటున్నారు అన్న అంశాలపై సుమారు అయిదుగంటలపాటు సుదీర్ఘంగామాట్లాడారు. రైతుకూలీ హక్కుల పోరాట సమితి నాయ‌కుడు అయిన అనుమోలుగాంధీ - సమాజసేవ చేస్తున్న ఏ. నౌరోజీరెడ్డి - అసైన్ ల్యాండ్ ఓన‌ర్స్ అసోసియేషన్ ప్ర‌తినిధి - న్యాయవాది - సిరిపురపు ఫ్రాన్సిస్ - నేషనల్ ట్రేడ్ యూనియన్ నాయకులు వీవీ రామారావు - రిటైర్డ్ ప్రొఫెస‌ర్ జాక‌బ్ శాస్త్రి - వాకర్స్ సంఘం అధ్యక్షుడు నండూరిరామకృష్ణ ప‌వ‌న్‌ ను క‌లిసిన వారిలో ఉన్నారు.
=====