Begin typing your search above and press return to search.
రాజధానిపై పవన్ పోరాటం ముగిసినట్టే?
By: Tupaki Desk | 2 Sept 2019 10:55 AM ISTరాజధాని వ్యవహారం పెద్ద స్కామ్ లా ఉంది - ఒక రాజధాని వంద స్కామ్ లు అనే పరిస్థితి కనిపిస్తోంది. జనసేన అధిపతి పవన్ కల్యాణ్ వాటికి కూడా మద్దతు పలుకుతున్నారా? రాజధాని దోపిడీలో జనసేన కూడా పాలు పంచుకుంటోందా?' అంటూ ఘాటుగా ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాజధాని విషయంలో జనసేన అధిపతి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బొత్స స్పందించిన నేపథ్యంలో..దానిపై పవన్ కల్యాణ్ స్పందిస్తారా? అనేది ఆసక్తిదాయకంగా మారింది.
సాధారణంగా పవన్ కల్యాణ్ ఏ విషయంలో అయినా ఒకసారే స్పందిస్తారు. తనకు తోచింది ఏదో మాట్లాడి వెళ్లిపోతారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ అదే విషయం గురించి మాట్లాడిన దాఖలాలు వెదికినా కనపడవు. పవన్ కల్యాణ్ ఇది వరకూ అనేక అంశాల గురించి మాట్లాడారు. అనేక వ్యవహారాలపై ప్రకటనలు చేశారు. వాటికి పరిష్కారాలుగా తను పోరాడతా అన్నారు.
చేనేత కార్మికుల సమస్యలపై గతంలో స్పందిస్తూ వారిని ప్రధాని మోడీ వద్దకు తీసుకెళ్తానంటూ ప్రకటన చేశారు. ఆ తర్వాత ఊసు లేదు. ఇక ప్రత్యేకహోదా - కేంద్రంపై అవిశ్వాస తీర్మానం.. వంటి వ్యవహారాలు - అప్పట్లో చేసిన నిరాహార దీక్ష ప్రకటనలు గాలికిపోయాయి!
ఇదే తీరున రాజధానిపై కూడా పవన్ కల్యాణ్ పోరాటం ముగిసినట్టేనా? అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా భూముల సేకరణ సమయంలో పవన్ కల్యాణ్ రాజధాని ప్రాంతానికి వెళ్లి వచ్చారు. అప్పుడు కూడా జనాలు ఇచ్చిన క్యారేజ్ లు తిని… పవన్ కల్యాణ్ వారి మధ్యన కూర్చుని సినిమాలాంటి భావోద్వేగాలను పండించారు. ఆ తర్వాత మళ్లీ ఐదేళ్ల పాటు కూడా రాజధాని భూముల రైతుల గురించి పవన్ మాట్లాడిందే లేదు. ఏ వ్యవహారంలో అయినా ఒకసారి వెళ్లి రావడమే తన పని - అక్కడకు వెళ్లి బీరాలు పలికి వచ్చేస్తే తన పని అయిపోతుందన్నట్టుగా పవన్ వ్యవహారిస్తూ ఉంటారు.
ఈ రాజధాని పై పవన్ పోరాటం కూడా అదే బాపతే అని జనాలు గుసగుసలాడుతున్నారు. ఒకవేళ బొత్స సంధించిన ప్రశ్నలకు పవన్ ఇప్పుడు సమాధానాలు చెప్పకపోతే.. రాజధాని మాటున దాగి ఉన్న స్కాముల ఊసే ఎత్తకపోతే పవన్ ఆ వ్యవహారాన్ని పట్టించుకోవడం దాదాపు మానేసినట్టే అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు!