Begin typing your search above and press return to search.

పీకే దూకుడు!..వెయిట్ అండ్ సీకి వ‌చ్చేసిందా?

By:  Tupaki Desk   |   9 Jan 2019 10:51 AM GMT
పీకే దూకుడు!..వెయిట్ అండ్ సీకి వ‌చ్చేసిందా?
X
జ‌న‌సేన అధినేత దూకుడు మ‌న‌స్త‌త్వం కాస్తా... సినిమాల‌ను వ‌దిలేసి రాజ‌కీయాల్లోకి రాగానే నిజంగానే డంగైపోయింద‌న్న స‌రికొత్త విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. సినిమాల్లో ప‌వ‌ర్ స్టార్‌ గా దూకుడుగా వ్య‌వ‌హ‌రించిన ప‌వ‌న్‌... త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక ఇమేజీని సంపాదించుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి సోద‌రుడిగానే తెరంగేట్రం చేసిన ప‌వ‌న్‌... త‌న‌దైన శైలి దూకుడుతో ప‌వ‌ర్ స్టార్‌ గా ఎదిగి.. మెగాస్టార్‌ ను మించిన అభిమాన ధ‌నాన్ని కూడా సంపాదించుకున్నారు. ప‌వ‌న్ రోడ్డెక్కితే... ప‌వ‌న్ ఫ్యాన్స్ వేలాది మందిగా త‌ర‌లివ‌చ్చిన దృశ్యాల‌ను మ‌నం చూశాం. అదంతా గ‌తం. ఇప్పుడు సినిమాల‌ను వ‌దిలేసి రాజ‌కీయ రంగంలోకి దిగిన త‌ర్వాత ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింద‌నే చెప్పాలి. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత త‌న అభిమాన గ‌ణం కంటే కూడా త‌న సామాజిక వ‌ర్గమే ప‌వన్ ద‌రికి చేరుతుంద‌న్న విశ్లేష‌ణ‌లు కూడా లేక‌పోలేదు. సినిమాల్లో చూపించిన దూకుడునే రాజ‌కీయాల్లోనూ చూపిస్తానంటూ బీరాలు ప‌లికిన ప‌వ‌న్‌.. వాస్త‌వ ప‌రిస్థితుల‌ను చూసి నిజంగానే డంగైపోయార‌న్న వాద‌న వినిపిస్తోంది. పార్టీ ప్ర‌క‌ట‌న ద‌గ్గ‌ర నుంచి పార్టీ శ్రేణుల‌ను విస్త‌రించే విష‌యంలో త‌న‌దైన శైలిలో దూసుకెళ్లిన ప‌వ‌న్‌... సినిమాల్లో మాదిరిగా రాజ‌కీయాల్లో సాధ్యం కాద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

మొన్న‌టిదాకా పార్ట్ టైం పొలిటీషియ‌న్ అని పిలిపించుకున్న ప‌వ‌న్‌... ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో పాలిటిక్స్‌ పై కాస్తంత ఎక్కువ దృష్టినే సారించారు. గ‌డ‌చిన వారం రోజులుగా విజ‌య‌వాడ‌లోనే మ‌కాం పెట్టేసిన ప‌వ‌న్‌... రాష్ట్రంలోని అన్ని జిల్లాల నేత‌ల‌తో వ‌రుస భేటీలు నిర్వ‌హిస్తున్నారు. ఈ భేటీల‌కు ఆయా జిల్లాల నుంచి ఏఏ స్థాయి నేత‌లు వ‌స్తున్నార‌న్న విష‌యాన్ని బ‌య‌ట‌కు రాకుండా చూసుకుంటున్న ప‌వ‌న్‌... జిల్లా స్థాయి స‌మీక్ష‌లు ఫ్రూట్‌ ఫుల్‌ గానే సాగుతున్నాయ‌ని క‌ల‌రింగ్ ఇచ్చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు అస‌లు సిస‌లు రాజ‌కీయంలోకి దిగ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితిలో ఎక్క‌డ దెబ్బైపోతానోన‌న్న బెంగ ప‌వ‌న్‌ కు బాగా ప‌ట్టుకుంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ భ‌యం కార‌ణంగానే మొన్న‌టిదాకా చూపిన త‌న దూకుడు త‌త్వాన్ని పూర్తిగా మార్చేసుకున్న జ‌న‌సేనాని వెయిట్ అండ్ సీ ధోర‌ణే మేల‌న్న భావ‌న‌కు వ‌చ్చార‌ట‌.

ఇందులో భాగంగా ఎన్నికల్లో పార్టీ త‌ర‌ఫున పోటీకి దిగే అభ్య‌ర్థుల ఖ‌రారు విష‌యంలో ఈ పంథా త‌న‌ను ఒడ్డున ప‌డేస్తుంద‌ని కూడా ఆయ‌న భావిస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌ల అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న విష‌యంలో అధికార టీడీపీతో పాటు విప‌క్ష వైసీపీ కూడా త‌న అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన త‌ర్వాతే జ‌న‌సేన జాబితాను విడుద‌ల చేయాల‌ని కూడా ప‌వ‌న్ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌. అంటే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ - వైసీపీ నిలిపే అభ్య‌ర్థులు తేలాక‌... ఆ రెండు పార్టీల్లో ఎవ‌రైనా అసంతృప్తులు ఉన్నారా? లేకుంటే... త‌న పార్టీలోనే ఉన్న నేత‌ల్లో ఆ రెండు పార్టీల నేత‌ల‌కు ధీటుగా నిల‌బ‌డ‌గ‌లిగే నేత‌లెవ‌రనే విష‌యాన్ని నిర్థారించుకున్న త‌ర్వాతే అభ్యర్థ‌ల‌ను ప్ర‌క‌టించాల‌న్న కోణంలో ప‌వ‌న్ వెయిట్ అండ్ సీ ధోర‌ణిలోకి వెళ్లిపోయార‌ని విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. మొత్తంగా సినిమాల్లో మాదిరిగా దూకుడు త‌న‌కు ప‌నికి రాద‌ని తేల్చేసుకున్న ప‌వ‌న్‌... వేచి చూసే ధోర‌ణిలోకి వెళ్లిపోయార‌న్న మాట‌.