Begin typing your search above and press return to search.
అంత సత్తా ఉంటే..ఇంత ఘోర ఓటమి ఎందుకుంటుంది పవన్?
By: Tupaki Desk | 22 Jan 2020 1:30 AM GMTఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సినీనటుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ పార్టీ ఏపీలో కేవలం ఒక్క అసెంబ్లీ స్థానంలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేస్తే...రెండు చోట్లా ఓడిపోయారు. ఎన్నో అంచనాలు ఆ పార్టీపై వ్యక్తమవగా...ఘోర ఓటమని జనసేన నమోదు చేసుకుంది. అయితే, ఇలాంటి తరుణంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాజాగా గోదావరి జిల్లాలకు చెందిన నేతలతో సమావేశమైన పవన్ గోదావరి జిల్లాల్లో మాటలతో అయ్యే రాజకీయాలను వైసీపీ నాయకులు కత్తులు, కటార్ల వరకు తీసుకువచ్చారని ఆరోపించారు. ``రాయలసీమలో ప్రతి ముద్దకీ పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ అలాంటి పరిస్థితులు ఉండవు. గోదావరి జిల్లాలకు కూడా అలాంటి సంస్కృతిని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో సీమ తరహా రాజకీయ ఉండదనీ, పెద్దరికం మాత్రమే ఉంటుంది. ఫ్యాక్షన్ సంస్కృతిని బలంగా ఎదుర్కోవాలి` అని పిలుపు నిచ్చారు.
జనసేన గురించి వివరిస్తూ ``ఓ సరికొత్త భావజాలాన్ని రాజకీయాలకు పరిచయం చేయాలన్న లక్ష్యంతో పార్టీ స్థాపించాను. మన ప్రభావం ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలతో కలిపి సుమారు 70కి పైగా ఎంపి స్థానాల్లో ఉంటుంది. వ్యక్తిగతంగా ఎదగాలి అనుకుంటే ఆనాడే ఏదో ఒక జాతీయ పార్టీ దగ్గరకు వెళ్లేవాడిని. ఎప్పుడో పదవులు వచ్చి ఉండేవి.`` అని చెప్పుకొచ్చారు. అయితే, నిజంగా 70 పార్లమెంటు స్థానాల్లో ప్రభావితం చేయగలిగి ఉంటే... పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పవన్ రెండు చోట్లా ఎందుకు ఓడిపోతారు? కేవలం ఒక్క ఎమ్మెల్యేనే...ఎం