Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ర‌హ‌స్య పూజ‌లు..జ‌న‌సేన‌లో క‌ల‌క‌లం

By:  Tupaki Desk   |   1 Oct 2018 3:28 PM GMT
ప‌వ‌న్ ర‌హ‌స్య పూజ‌లు..జ‌న‌సేన‌లో క‌ల‌క‌లం
X
జ‌న‌సేన అధినేత - సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాంత్రిక పూజ‌ల వ్య‌వ‌హారం మ‌రోమారు తెర‌మీద‌కు వ‌చ్చింది. స‌రిగ్గా గ‌తంలో ఏ దేవాల‌యం పేరుతో అయితే ఈ ర‌చ్చ జ‌రిగిందో అదే దేవాల‌యం ప్ర‌స్తావ‌న‌తో మ‌ళ్లీ ఆయ‌న పూజ‌ల ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. పశ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం ఐఎస్‌ జగన్నాధపురంలోని నరసింహస్వామిలో ఆలయంలోనే పవన్ కళ్యాణ్ తాంత్రిక పూజలు చేశారని గతంలో సినీ విమర్శకుడు కత్తి మహేష్ ఆరోపణలు చేసి క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌ళ్లీ అదే త‌ర‌హా వార్త తెర‌మీద‌కు రాగా....జ‌న‌సేన వార్గాలు క్లారిటీ ఇచ్చాయి.

జ‌న‌సేన వ‌ర్గాల ప్ర‌క‌ట‌న ప్ర‌కారం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ తెల్ల‌వారున జంగారెడ్డిగూడెం మండలంలోని ఐఎస్‌ జగన్నాధపురం గ్రామంలోని ప్రఖ్యాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాల‌యంలో పూజ‌లు చేయ‌గా...దానిపై ప‌లు వ‌ర్గాలు తాంత్రిక పూజ‌ల‌ని ప్రచారంలో పెట్టాయి. ప‌వ‌న్ త‌న ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ఈ విధంగా వ్య‌వ‌హ‌రించార‌ని కొన్ని మీడియా సంస్థ‌ల్లో ప్ర‌చారం జ‌రిగింది. ఈ వార్త‌లు క‌ల‌క‌లం సృష్టించిన నేప‌థ్యంలో జ‌న‌సేన వ‌ర్గాలు అధికారికంగా క్లారిటీ ఇచ్చాయి. ``ఈరోజు తెల్లవారుజాము 3:30 గంటలకు జంగారెడ్డిగూడెం మండలంలోని I.S జగన్నాధపురం గ్రామంలోని ప్రఖ్యాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని దర్శించుకొని - పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు`` అంటూ ట్విట్ట‌ర్‌ లో వెల్ల‌డించింది. మ‌రోవైపు ప‌వ‌న్ ఫ్యాన్స్ సైతం ఈ అంశంపై స్పందిస్తూ...`అందరి వలే పూజలు చేయాలంటే గుడిలో ప్రజలను కంట్రోల్ చేయడం వీలుకాదు భక్తులకు అసౌకర్యంగా ఉంటుంది అందుకే తెల్లవారజమున పూజలు చేస్తె అందులో ఏం తప్పుంది అదే పోలవరం నిర్వాసితుల సమస్యలను తెలియచేస్తె అది అసలు ప్రసారం చేయరు ఈ పచ్చకుల మీడియా గద్దలు`` అంటూ ప‌లువురు ఫ్యాన్స్ మండిప‌డ్డారు.