Begin typing your search above and press return to search.
కస్సు మీదున్న బెజవాడ మీడియా?
By: Tupaki Desk | 13 Nov 2015 11:38 AM GMTతెలంగాణ ఉద్యమం జోరుగా సాగే సమయంలో.. హైదారాబాద్ లోని మీడియాతో మాట్లాడాలంటే పలువురు నేతలకు చాలా కష్టంగా ఉండేది. కాలికేస్తే మెడకు.. మెడకు వేస్తే కాలికి వేస్తూ నానా తిప్పలు పెట్టేవారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేవారు. వీరి ప్రశ్నలతో తెలంగాణ నేతలు చాలా ఇబ్బంది పడేవారు. ఏదైనా మాట్లాడితే పార్టీ అధినాయకత్వాలతో ఇబ్బంది పడాలి.. అలా అని మాట్లాడకుండా మాట దాటేస్తే.. తెలంగాణ ప్రజల దగ్గర బద్నాం కావాలి. అందుకే.. చాలా ఇబ్బంది పడేవారు. మరికొందరు అయితే మీడియాకు ముఖం చాటేసినోళ్లూ ఉన్నారు.
చివరకు పరిస్థితి ఎలా తయారైందంటే.. మీడియా మైకులు కనిపిస్తే ఉత్సాహంగా ముందుకొచ్చే నేతలు కాస్త.. మీడియా వాసన సోకినా ఆ దరిదాపుల్లోకి వచ్చే వారు కాదు. టీఆర్ ఎస్.. బీజేపీ మినహా మిగిలిన అన్నీ పార్టీ నేతలు ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారని చెప్పాలి. దీంతో.. సీమాంధ్ర నేతలు చాలా చిరాకు పడేసేవారు. మీరు ఇలా మాట్లాడతారేంటని పలువురు నేతలు అక్రోశం వ్యక్తం చేసేవారు.
తెలంగాణ సెంటిమెంట్ తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉందో.. తాజాగా అలాంటి పరిస్థితే బెజవాడ మీడియా ప్రదర్శించటం గమనార్హం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయి.. మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై ఆయన సూటి ప్రశ్నలు చాలానే ఎదుర్కొన్నారు. ఒకరిద్దరు మీడియా ప్రతినిధులైతే.. ‘‘ఎన్నికల ప్రచారంలో మీరు.. మోడీ.. చంద్రబాబునాయుడు ముగ్గురు కలిసి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఆశలు కల్పించారు. హామీలు ఇచ్చారు. ఈ రోజు ప్రధానమంత్రి అయిన మోడీ మాట్లాడటం లేదు. మీరు ఢిల్లీకి వెళ్లి మోడీని ఈ విషయం మీద ఎందుకు ప్రశ్నించరు?’’ అని ప్రశ్నిస్తే.. ‘‘అసలు మీరు ఢిల్లీ ఎప్పుడు వెళుతున్నారు?’’ అంటూ ప్రశ్నించిన మీడియా ప్రతినిధులు ఉన్నారు.
మీడియా ప్రతినిధుల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయిన పవన్ కల్యాణ్.. చాలావరకూ సమాధానాలు దాటవేస్తే.. మరికొన్ని విషయాలపై తనకున్న పరిమితుల్ని చెప్పుకొచ్చారు. దీక్ష చేయటం.. ఢిల్లీ వెళ్లి నిలదీయటం లాంటివి వినేందుకు బాగా ఉన్నా.. ఆచరణలో కష్టమని.. దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న మాటను సర్దిచెప్పే ధోరణిలో చెప్పుకొచ్చారు. పవన్ మాటల్ని పక్కన పెడితే.. మీడియా ప్రతినిధుల ప్రశ్నల జోరు మాత్రం.. తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో హైదరాబాద్ మీడియా వ్యవహరించిన ధోరణిలో ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రత్యేక హోదా విషయంలో ఏ మాత్రం ఆలస్యం చేసినా.. బీజేపీ.. టీడీపీ నేతలకు తిప్పలు తప్పవన్న మాట వినిపిస్తోంది.