Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ కొత్త న్యూస్ చానెల్.. బండ్ల ప్లాన్?

By:  Tupaki Desk   |   6 Jun 2021 5:30 PM GMT
పవన్ కళ్యాణ్ కొత్త న్యూస్ చానెల్.. బండ్ల ప్లాన్?
X
పవన్ కళ్యాన్ ను దేవుడిగా భావించి కొలిచే నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తాజాగా గురువు కోసం భారీ ప్రయత్నానికి పూనుకుంటున్నట్టు తెలుస్తోంది. టీడీపీకి తెలుగునాట మెజార్టీ న్యూస్ చానెల్స్, పత్రికలు ఉన్నాయి. ఇక వైసీపీకి అనుబంధంగా ఒకటి రెండు న్యూస్ చానెల్స్ పేపర్ ఉన్నాయి. కానీ జనసేనకు అధికారికంగా ఒక్క న్యూస్ చానెల్ లేదు. పత్రికలు సపోర్టుగా లేవు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కోసం ఓ న్యూస్ చానెల్ పెట్టేందుకు బండ్ల గణేష్ రెడీ అయినట్టు తెలుస్తోంది.

తాజాగా పవన్ కళ్యాన్ ను ఆదరించాలంటే ఒక న్యూస్ చానెల్ అవసరం అని.. మీరు ఓ చానెల్ పెట్టండి. దానికి జనసైనికులం అండగా ఉంటాం అంటూ ఓ పవన్ అభిమాని పెట్టిన పోస్టుకు బండ్ల గణేష్ పరోక్షంగా సానుకూలంగా స్పందించారు. దానికి రీట్వీట్ కొట్టి తన ఆమోదాన్ని తెలిపారు.

త్వరలోనే బండ్ల గణేష్ నిర్మాతగా పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే పవన్ కోసం ఓ న్యూస్ చానెల్ పెట్టేందుకు బండ్ల రెడీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రస్తుతం ఏపీలో బీజేపీతో పవన్ జట్టుకట్టాడు. బీజేపీకి మద్దతుగా ఏపీ, తెలంగాణలో చానెల్స్ లేవు. ఈ క్రమంలోనే 2024లో బీజేపీతో కలిసి సీఎం క్యాండిడేట్ గా తెరమీదకు వచ్చిన పవన్ తనకంటూ ఓ న్యూస్ చానెల్ అవసరమని జనసైనికులు భావిస్తున్నారు. ఇందుకోసం బండ్ల గణేష్ ను ముందుటపడాలని చూస్తున్నారు.