Begin typing your search above and press return to search.

ఆ ఓట్ల కోసం ప‌వ‌న్ కొత్త ఎన్నిక‌ల స్టంట్‌..!

By:  Tupaki Desk   |   24 Oct 2021 3:30 AM GMT
ఆ ఓట్ల కోసం ప‌వ‌న్ కొత్త ఎన్నిక‌ల స్టంట్‌..!
X
ఇటీవ‌ల కాలంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వేస్తున్న అడుగులు వింత‌గా ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆయ‌న‌కు గ‌త ఐదేళ్ల త‌న మిత్ర‌ప‌క్షం టీడీపీ పాల‌న‌లో క‌నిపించ‌ని జాతీయ నాయ‌కులు.. రాష్ట్ర పాల‌కులు ఇప్పుడు క‌నిపిస్తున్నార‌ని చెబుతున్నారు. కొన్నాళ్లుగా ప‌వ‌న్‌కు ద‌ళిత ముఖ్య‌మంత్రి.. దివంగ‌త దామోద‌రం సంజీవ‌య్య క‌నిపిస్తున్నారు. ఆయ‌న ఇంటిని స్మార‌కంగా.. ఏర్పాటు చేస్తామ‌ని.. దీనికి సంబంధించి రూ.కోటితో క‌న్సాలిడేట్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని.. ఆయ‌న చెబుతున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న ఇంటికి సంబంధించి.. జ‌న‌సేన నాయ‌కులు ప‌రిశీలించి వ‌చ్చారు.

ఇక‌, ఇప్పుడు ప‌వ‌న్ తాజాగా మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అదేంటంటే.. క‌ర్నూలు జిల్లాకు దామోద‌రం సంజీవ‌య్య పేరు పెట్టాల‌ని. ఇది మంచి ప్ర‌క‌ట‌నే. త‌న జీవితాన్ని పూర్తిగా ప్ర‌జ‌ల‌కే పూర్తిగా అంకితం చేసిన‌.. మేధావి.. క‌నీసం ఒక్క రూపాయి అవినీతి కూడా చేయ‌ని నాయ‌కుడిగా.. జీతం కూడా త‌క్కువ‌గా తీసుకున్న సీఎంగా చ‌రిత్ర సృష్టించిన దామోద‌రం సంజీవ‌య్య‌కు ఇలాంటి గౌర‌వం ఇవ్వ‌డాన‌న్ని ఎవ‌రూ త‌ప్పుప‌ట్ట‌రు. పైగా చేయాల‌నే వ్యాఖ్య‌లు కూడా వ‌స్తున్నాయి. అయితే.. ఇక్క‌డ వ‌చ్చింద‌ల్లా.. జ‌గ‌న్ హ‌యాంలోనే ఎందుకు ప‌వ‌న్ ఇలాంటి డిమాండ్లు చేస్తున్నార‌నేదే..!

దీనికితోడు.. గ‌త చంద్ర‌బాబు హ‌యాంలో ప‌వ‌న్ మిత్ర ప‌క్షంగా ఉన్నారు. ఆ స‌మ‌యంలో అయితే.. ఎలాంటి డిమాండ్లు లేకుండా.. త‌ను ఒక్క‌మాట చెబితే చేసేందుకు చంద్ర‌బాబు సిద్ధంగా ఉన్నారు. కానీ.. అప్ప‌ట్లో మాత్రం ప‌వ‌న్ చేయ‌లేదు. ఇప్పుడు మాత్ర‌మే సంజీవ‌య్య‌పై ప్రేమ పొంగుకొచ్చిందా ? అంటే.. ఇప్పుడు.. ప‌వ‌న్ వ్యూహం వేరే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. త‌ను చెబితే.. జ‌గ‌న్ ఎలాగూ చేయ‌డు.. సో.. దీనిని అడ్డు పెట్టుకుని.. ఎస్సీ నాయ‌కులంటే.. జ‌గ‌న్‌కు లెక్క‌లేద‌నే ప్ర‌చారం చేయొచ్చ‌ని.. ప‌వ‌న్ ప్లాన్‌. పోనీ.. ప‌వ‌న్ డిమాండ్ ప్ర‌కారం.. జ‌గ‌న్ క‌ర్నూలు జిల్లాకు సంజీవ‌య్య పేరు పెట్టినా.. దానిని త‌న‌ఖాతాలో వేసుకునే ఛాన్స్ ప‌వ‌న్‌కు ఉంటుంది.

త‌ను చెప్ప‌బ‌ట్టి.. త‌ను డిమాండ్ చేయ‌బ‌ట్టి.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని..పవ‌న్ ప్ర‌చారం చేయొచ్చు. అదే స‌మ‌యంలో ఎస్సీ ఓటు బ్యాంకును త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేయొచ్చు. నిజానికి 2019 ఎన్నిక‌ల్లో ఎక్క‌డో ఉన్న మాయావ‌తిని తీసుకువ‌చ్చి.. పవ‌న్ వేదిక‌ల‌పై పొర్లు దండాలు పెట్టారు.. కానీ.. ఇప్పుడు ఆమె ఊసు కూడా ఎత్త‌డం లేదు. ఇదంతా ఎన్నిక‌ల స్టంటేన‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. మ‌రి ఇది ప‌వ‌న్ మ‌రిచిపోయారా? ఎస్సీ కోసం మాయావ‌తి కాళ్లు ప‌ట్టుకున్నార‌నే వాద‌న ఆయ‌న మ‌రిచిపోయి ఉండొచ్చు. ఇప్పుడు సంజీవ‌య్య విష‌యం కూడా అంతే. కేవ‌లం ఎస్సీ ఓటు బ్యాంకు కోసం.. ప‌వ‌న్ చేస్తున్న జిమ్మిక్కుల్లానే అంద‌రూ భావిస్తున్నారు. మ‌రి ఎస్సీలు.. ప‌వ‌న్‌ను న‌మ్ముతారో లేదో చూడాలి.