Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ పొలిటిక‌ల్ స్టెప్ పై క్లారిటీ వ‌చ్చేసిన‌ట్లే!

By:  Tupaki Desk   |   9 Jan 2017 6:30 PM GMT
ప‌వ‌న్ పొలిటిక‌ల్ స్టెప్ పై క్లారిటీ వ‌చ్చేసిన‌ట్లే!
X
గత కొద్ది కాలంగా ట్వీట్‌ లు - ద్వారా బహిరంగ సభల ద్వారా గర్జించిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఏపీలో కొత్త రాజకీయాలకు తెరతీయనున్నారా అనే చ‌ర్చ ఏపీ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. ఉద్దానం కిడ్నీ బాధితుల తరపున ఆందోళనకు దిగిన జనసేనాధిపతి ఏపీ సర్కార్ కు ముందుగా అల్టిమేటం జారీచేశారు. ఈ క్ర‌మంలో రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కిడ్నీ బాధితుల సమస్యలపై తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారుల‌ను ఆదేశించగా...స్పందించిన పవన్‌ కళ్యాణ్‌ ఏపీ సర్కార్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. కిడ్నీ బాధితుల విషయంలో ఏపీ సర్కార్‌ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ పవన్ ట్వీట్లు ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారితీశాయి. కిడ్నీ బాధితుల సమస్యను అన్ని పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చాలని కోరారు. అదే సందర్భంలో జనసేన పార్టీ సాధించిన తొలి విజయంగా పేర్కొంటూనే ఈ సమస్య విషయంలో మంత్రి అచ్చెన్నాయుడి కంటే సీఎంకు ఎక్కువ అవగాహన ఉందని ప‌వ‌న్ వ్యాఖ్యానించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

వచ్చే సాధారణ ఎన్నికల్లో పోటీచేస్తానని జన సేనాధిపతి ఇప్పటికే వెల్లడించిన విషయయం తెలిసిందే. అయితే తాను ఏ పార్టీతో పొత్తుపెట్టుకొని పోటీకి దిగేది లేక అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీకి దిగేది ఆయన ఎన్నడూ స్పష్టత ఇవ్వలేదు. గత సాధారణ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీకి మద్దతు ఇచ్చిన పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల కాలంలో కేంద్రంలోని మోడీ సర్కార్‌ పై విమర్శలు గుప్పించారు. తద్వారా బీజేపీకి తాను దూరమన్నట్లుగా సంకేతాలిచ్చారు. అదే రకమైన సంకేతాలు బీజేపీ నేతలు ఇచ్చారు. పవన్‌ కళ్యాణ్‌ కు రాజకీయ అవగాహన లేదని విమర్శలు చేస్తూ ఆయనకు దూరమైనట్లేనని బీజేపీ నేతలు కూడా తమ విమర్శల ద్వారా స్పష్టంచేశారు. కానీ టీడీపీ సర్కార్‌ పై మాత్రం పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలు చేసినా అవి సూచనలు, డిమాండ్ల తరహాలో ఉంటున్నాయో గానీ ఎక్కడా విమర్శ రూపంలో రావడంలేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ప్రస్తుతం ఉద్దానం ఘటనపై ఏపీ సర్కార్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తూ పవన్‌ కళ్యాణ్ ట్వీట్‌ చేయడంతో జనసేన రాజకీయ పయనంపై ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.ఎన్నికల్లో విజయం కోసం ప్రజలను ఆకట్టుకోవడంతో పాటు పొత్తు వ్యూహాలు ముఖ్యమేనని రాజకీయ వర్గాల మాట. ఎందుకంటే మనదేశంలోని ప్రతి ఎన్నికల్లో కేంద్ర - రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలు వచ్చినా కేవలం 35శాతం నుంచి 40శాతం ఓట్లతోనే అధికారంలోకి వస్తుంటాయి. అందుకే ఎన్నికల్లో గెలవడానికి ప్రజాద్దరణ ఉన్న పార్టీలు కొన్ని సందర్భాలలో పొత్తుపెట్టుకొని బరిలోకి దిగుతుం టాయి.

కేంద్ర - రాష్ట్ర ఎన్నికలు మరో రెండున్నరేళ్లలో ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలోని టీడీపీ సర్కార్‌ కూడా విజయం కోసం వ్యూహాలను గత ఆరు నెలల కాలం నుంచే మొదలె ట్టినట్లు సమాచారం. వచ్చే సాధారణ ఎన్నికలలో బీజేపీతో పొత్తు ఎంతవరకు కలిసొస్తుందన్న యోచనలోనున్న టీడీపీ నాయకత్వం రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెక్‌పెట్టేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో దిగినట్లు తెలు స్తోంది. ఏపీకి ప్రత్యేకహోదా తదితర అంశాలపై పోరు హోరు కొనసాగిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి బ్రేకులే యాలంటే అదే అంశంతో పోరాట రంగంలోకి దిగే మరో పార్టీని ప్రోత్సహించడం అంతే అవసరమన్న భావన నేపథ్యంలోనే జనశక్తి తెరపైకి వచ్చిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. జనసేన పార్టీ తెరపైకి రావడం ఇతర పార్టీల కంటే టీడీపీకే ప్రస్తుత తరుణంలో ఎంతో అవసరమని రాజకీయ వర్గాల విశ్లేషణ. ఈ క్రమంలోనే టీడీపీ అంతర్గత ప్రోత్సహంవల్లే జనసేనపార్టీ తెరపైకి వచ్చిందని పేర్కొంటున్న ప్రతిపక్ష నేతలు ఉన్నారు. అందుకే పవన్‌ కళ్యాణ్‌ కేంద్రంపై ఘాటైనా విమర్శలు చేస్తున్నా టీడీపీ సర్కార్‌ పై పోరుకు దిగుతున్నా కేవలం సూచనలు, తమ డిమాండ్లను పరిష్కరించండి అని పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే సాధారణ ఎన్ని కల్లో టీడీపీ కి జై కొట్టి ఆ పార్టీకి ఎన్నికల్లో సహకరిస్తారా ఒకవేళ జనసేన పార్టీ ఎన్నికల బరిలో దిగినా తెలుగుదేశంతో సీట్ల సర్దుబాటు చేసుకొంటుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/