Begin typing your search above and press return to search.
వామ్మో.. ఈ రాజకీయ అంచనాలేందిరా బాబు..?
By: Tupaki Desk | 8 July 2015 12:30 PM GMTఅదిగో తోక అంటే ఇదిగో పులి అన్నట్లుగా మారాయి రాజకీయ ఊహాగానాలు. నేతల నోటి నుంచి ఒక్కమాట వచ్చిన వెంటనే.. రాజకీయ అంచనాలు ఒక పద్ధతి పాడు లేకుండా మారిపోయాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.
తాజాగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తెలంగాణ.. ఏపీ రాజకీయాల గురించి దాదాపు 43 నిమిషాల సేపు మాట్లాడారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల అధికారపక్షాలపై చురకలు వేయటంతో పాటు.. హితవు పలికారు. రానున్న రోజుల్లో రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు సరిగా లేకుంటే సివిల్ వార్ తప్పదన్న భయాన్ని వ్యక్తం చేశారు.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాధ్యతగా వ్యవహరించాలని చెప్పిన పవన్ కల్యాణ్ పలు అంశాల్ని ప్రస్తావించారు. ఇందులో భాగంగా సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రస్తావించిన ఆయన.. టీడీపీనుంచి తెలంగాణ అధికారపక్షంలోకి మారిన విషయాన్ని ప్రస్తావించి.. ఆయన పార్టీ మారారే కానీ.. నియోజకవర్గ ప్రజల మనసుల్ని మార్చగలరా? అంటూ వ్యాఖ్యలు చేశారు.
కట్ చేస్తే.. తాజాగా పవన్ కల్యాణ్ సనత్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా కథనాలు విపరీతంగా వచ్చేస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసే సమయంలో తన ఎమ్మెల్యేగిరికి రాజీనామా చేసినప్పటికీ.. ఇప్పటికీ తెలంగాణ స్పీకర్ దాన్ని ఆమోదించలేదు. దానిపై నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు.. దానిపై ఎప్పటికి నిర్ణయం తీసుకుంటారో కూడా తెలీని పరిస్థితి.
తలసాని రాజీనామాను స్పీకర్ ఆమోదించిన రోజు నుంచి ఆర్నెల్ల లోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. నిజంగా పవన్‌కల్యాణ్‌కు ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనే ఉంటే.. ఆయన పార్టీ పరంగా పూర్తి చేయాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. వీటన్నింటికి మించి..మొన్న మీడియా సమావేశంలోనూ తాను ప్రతి అంశం మీదా స్పందించే పరిస్థితి లేదని.. తనకు కొన్ని పనులు ఉన్నాయన్న విషయాన్ని ప్రస్తావించటం మర్చిపోకూడదు.
ఒకవేళ సనత్‌నగర్ నుంచి పోటీ చేసే ఆలోచన ఉంటే.. సెక్షన్ 8 అవసరం లేదన్న మాట వాడి ఉండే వారే కాదేమో. ఎందుంటే హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజల్లో ఎక్కువ మంది సెక్షన్ 8 ఉంటే బాగుండన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో సనత్‌నగర్‌లో ఎక్కువగా ఆంధ్రా ఓటర్లు ఉన్న మాట వినిపిస్తున్నప్పుడు వారికి నచ్చని మాటను పవన్ చెబుతారా? అన్నది మరో పాయింట్.
వీటన్నింటికి తోడు.. తాను పూర్తిస్థాయి రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని కాదని పదే పదే చెబుతున్న పవన్ కల్యాణ్.. ఏ రకంగా చూసినా సనత్‌నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదన్న మాట బలంగా వినిపిస్తుంటే.. అందుకు భిన్నంగా సనత్‌నగర్ నుంచి పవన్ పోటీ చేస్తారంటూ అంచనాలు వ్యక్తం కావటం చూసినప్పుడు.. వామ్మో.. ఇవేం రాజకీయ విశ్లేషణలు రా బాబు అనుకునే పరిస్థితి.