Begin typing your search above and press return to search.
కాపులు ప్లస్..బీసీలు ప్లస్...అదర్స్ ప్లస్...పవన్ మార్క్ పాలిటిక్స్...!
By: Tupaki Desk | 12 March 2023 9:00 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలు మరోసారి చర్చనీయాంశం అవుతున్నాయి. ఆయన మంగళగిరి పార్టీ ఆఫీసులో బీసీల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ తనకు కులాల పట్టింపు లేదని అన్నారు. తాను కాపులకు మాత్రమే నాయకుడిని అని ఎవరూ భావించాల్సిన అవసరం లేదని అన్నారు. తాను అందరి నాయకుడిని అని చెప్పారు. తాను జాతీయ భావాలతో పెరిగానను, మానవత్వం తన మతం అని పవన్ చెప్పారు.
తనను ఏదో ఒక కులానికి పరిమితం చేయాలనుకోవడం ప్రత్యర్ధుల కుటిల ఆలోచనగా ఆయన కొట్టి పారేశారు. తనకు అందరూ కావాలని అన్నారు. సమాజంలో వెనకబడిన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలన్నదే తన కోరిక అన్నారు. అలాగే అణగారిన వర్గాలకు చేయూతను ఇవ్వాలని తాను భావిస్తున్నాను అని పవన్ చెప్పుకున్నారు.
కాపులు బీసీలు కొట్టుకోవాలని, వారు ఎప్పటికీ కలవకూడదని కొందరు నేతలు, కొన్ని పార్టీల ఎత్తుగడ అని పవన్ విమర్శించారు. అందుకే తన మీద విమర్శలు చేయించేటపుడు బీసీ నేతలకు కాపు నేతలను ముందూ ఎగదోస్తారని ఆయన గుర్తు చేశారు నిజానికి ఆ రకమైన రాజకీయం చేసిన నాయకులు అంతా బాగానే ఉంటారని, వారు చక్కగా పలకరించుకుంటారని పవన్ గుర్తు చేశారు.
అంటే ఈ సమాజంలో అధికారం కొందరి చేతులలోనే ఉండాలని బీసీలు ఎదగరాదని,అలాగే ఎస్సీలు, ఎస్టీలు ఇతర బడులు వర్గాలు అలాగే ఉండాలని వారి కోరిక అని పవన్ విమర్సించారు. బీసీలు అంతా ఐక్యంగా ఉంటే బాగా ఉంటుంది కదా వారే ఎవరినీ అడగకుండా రాజ్యాధికారం సంపాదించుకోవచ్చు కదా అని పవన్ సూచించారు.
పోరాడితేనే అధికారం వస్తుంది తప్ప ఎవరినో అడిగితే రానే రాదు అని పవన్ అన్నారు. ఒటుని నోటు కోసం అమ్ముకునే విధానం ఉన్నంతవరకూ ఎవరికీ అధికారం దక్కదని పవన్ అన్నారు. ఎవరైనా ఆత్మగౌరవంతో పోరాడాలని అపుడు ఎంతటి అధికారం అయినా సొంతం కాక తప్పదని ఆయన అంటున్నారు.
మొత్తానికి పవన్ ఈసారి తన స్ట్రాటజీ మార్చారు. కాపులను బీసీలను ఒక్కటిగా ఉండమంటున్నారు. అంతే కాదు ఎస్సీస్, ఎస్టీలు ఇతర వర్గాలు అన్నీ ఒక్కటి కావాలని ఆయన కోరుకుంటున్నారు. ఈ విధంగా ఉంటే అదే అసలైన బలం అని అపుడు అధికారం కచ్చితనగా కోరుకున్న వారి చేతిలోకి వస్తుందని చెబుతున్నారు.
ఏపీలోని సామాజిక పరిస్థితులను చక్కగానే అధ్యయనం చేసిన పవన్ కళ్యాణ్ బీసీల సదస్సు పెట్టి వారికి రాజ్యాధికారం తప్పనిసరిగా అవసరం అని మాట్లాడారు. ఒక్క దెబ్బను రెండు పిట్టలు అన్నట్లుగా ఇటు బీసీలు అటు ఎస్సీస్ ఎస్టీ ఓటు బ్యాంకులను కొల్లగొట్టడానికి పవన్ మార్క్ అజెండాను సిద్ధం చేసుకుంటున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.