Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ తీరులో త‌ప్పు లేదు..కానీ క్రెడిబులిటీ పోతుందంతే!

By:  Tupaki Desk   |   31 Jan 2020 8:41 AM GMT
ప‌వ‌న్ తీరులో త‌ప్పు లేదు..కానీ క్రెడిబులిటీ పోతుందంతే!
X
త‌న బ్రెడ్ అండ్ బ‌ట్ట‌ర్ సినిమాలే అని జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్ క‌ల్యాణ్ తేల్చేశారు. కొన్నాళ్లుగా ప‌వ‌న్ క‌ల్యాణ్... అంటే ఆయ‌న జ‌న‌సేన అధ్య‌క్షుడు అనే ట్యాగ్ ను పేరు ముందు పెట్టాల్సి వ‌చ్చింది. అయితే ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ళ్లీ సినిమా హీరో అనిపించుకుంటున్నాడు. జ‌న‌సేన అధ్యక్షుడిగా ఉన్నా.. ఆయ‌న సినిమా వార్త‌ల్లోకి ఎక్కుతున్నాడు. ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉన్న‌ఫ‌లంగా ఇండ‌స్ట్రీలోకి దూకేయాల్సిన అవ‌స‌రం అయితే ఇండ‌స్ట్రీకి లేదు.

ఎందుకంటే..అక్క‌డ బోలెడంత‌మంది హీరోలు - బోలెడ‌న్ని సినిమాలు. హీరోల లోటు లేదు. వ‌చ్చే సినిమాలు ఎలాగూ వ‌స్తూనే ఉన్నాయి. అందునా రీమేక్ సినిమాలు చేసి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇండ‌స్ట్రీకి సేవ అయితే చేయాల్సిన అవ‌స‌రం లేదు. కానీ ఈ విష‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ సూటిగా చెబుతున్నాడు. త‌న‌కు సినిమాలే వ‌న‌రు అని ఆయ‌న చెబుతున్నాడు. త‌న‌కు సిమెంట్ ఫ్యాక్ట‌రీలు, పాల ఫ్యాక్ట‌రీలు లేవంటూ ప‌వ‌న్ కల్యాణ్ వ్యంగ్యంగా చెబుతూ ఉన్నారు.

అయితే ప‌వ‌న్ మాట త‌ప్పారు.. ఇది నిజం. ఇప్పుడు ప‌వ‌న్ త‌న‌ను తాను స‌మ‌ర్థించుకోవ‌డానికి ఎన్ని వ్యంగ్యాస్త్రాలు అయినా సంధించుకోవ‌చ్చు గాక‌. ఇక త‌న జీవితం రాజ‌కీయాల‌కే అంకితం అని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించుకోవ‌డం, అలా ప్ర‌జ‌ల ముందు ప్ర‌క‌టించి ఏడాది అయినా స‌రిగా కాక‌ముందే.. మ‌ళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌డం ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రెడిబులిటీని దెబ్బ‌తీస్తోంద‌ని ప‌రిశీల‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ప‌వ‌న్ త‌న‌కు డ‌బ్బు సంపాద‌న ముఖ్యం అనుకోవ‌చ్చు, సినిమాకు 50 కోట్లు వ‌స్తుంద‌నే లెక్క‌ల‌తో అటు వైపు వెళ్లొచ్చు. అయితే రాజ‌కీయ ప్ర‌సంగాలు చేసేట‌ప్పుడు త‌ను సినిమాల‌ను త్యాగం చేసి వ‌చ్చానంటూ చెప్పుకోవ‌డం, తీరా ఎన్నిక‌లు అయిపోగానే.. ఇలా సినిమాల వైపు వెళ్లిపోవ‌డం జ‌న‌సేన అధిప‌తి ద్వంద్వ వైఖ‌రిని చాటుతూ ఉంది.

ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయాల్లో ర‌క‌ర‌కాలుగా మాట‌లు మార్చారు. అమ‌రాతి - క‌ర్నూలు - రాజ‌ధాని - బీజేపీ.. ఇలా ర‌క‌ర‌కాల అంశాల గురించి ద్వంద్వ వైఖ‌రిని అవ‌లంభించి ప‌వ‌న్ క‌ల్యాణ్ విమ‌ర్శ‌ల పాల‌య్యారు. ఇప్పుడు సినిమాల విష‌యంలో కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ డ్యూయ‌ల్ టోన్ వినిపించినట్టు గా అవుతోంది. ఈ తీరును స‌మ‌ర్థించుకోవ‌డానికి ప‌వ‌న్ ఎన్ని మాట‌లు చెప్పినా.. త‌న‌కు ఆదాయం సినిమాలే అని చెప్పినా.. మాట మీద నిలబ‌డ‌క‌పోవ‌డం అనేది ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయ భ‌విత‌వ్యానికి తెర వేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు.