Begin typing your search above and press return to search.
అచ్చు..బాబు లాగే పవన్ దీక్ష!
By: Tupaki Desk | 13 Dec 2019 1:30 AM GMTదాదాపుగా ఓ నెల కిందట సరిగ్గా చెప్పాలంటే గత నవంబర్ 13వ తేదీన ఏపీ ప్రతిపక్ష నేత - టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన దీక్ష గుర్తుండే ఉంటుంది. ఇసుక కొరతపై విజయవాడలోని ధర్నా చౌక్ లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు చంద్రబాబు దీక్షలో కూర్చున్నారు. చంద్రబాబు దీక్షకు మద్దతుగా జనసేన నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఇసుక కొరత వల్ల ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున చేరుకుని సభను విజయవంతం చేయాలని టీడీపీ పిలుపునిచ్చింది. ఊహించినట్లుగానే అక్కడికి కొందరు చేరుకున్నారు. వారితో కలిసి చేతిలో పనిముట్లు మెడలో ఇసుక దండలు వేసుకొని...చంద్రబాబు ఫోటోలకు పోజులు ఇచ్చారు. సరిగ్గా ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ అదే చేశారు.
ముఖ్యమంత్రి జగన్ సర్కారు తీరును నిరిస్తూ...ధాన్యం రైతుల సమస్యలకు పరిష్కారం కోరుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాకినాడలోని జేఎన్టీయూ ఎదురుగా ఐ.టి.ఐ పక్కన ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో రైతు సౌభాగ్య దీక్షలో పాల్గొన్నారు. తను సైతం ఉదయం 8 గంటల సమయంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. మహిళలు హారతులు పట్టగా.. రైతులు పూల మాల వేసి ఆయనను వేదిక మీదకు ఆహ్వానించారు. రైతు దీక్షకు సంకేతంగా రైతులు - పార్టీ నాయకులు పచ్చని కండువాను కప్పి - వరి కంకులు బహుకరించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న జనసైనికులు - నాయకులు - రైతులకు అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ దీక్షకు కూర్చున్నారు. ఆయనతో పాటు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులు - తూర్పు గోదావరి జిల్లాతోపాటు ఇతర జిల్లాలకు చెందిన నాయకులు - రైతు సంఘాల నేతలు వేదికపై దీక్షలో కూర్చొని సంఘీభావం తెలిపారు. మరోవైపు జనసేనాని దీక్షకు జన సైనికులు - రైతులు భారీగా తరలి వచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది జన సైనికులు కాకినాడ చేరుకొని నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు.
కాగా, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు సౌభాగ్య దీక్ష - టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇసుక దీక్ష ఒకే రీతిలో ఉందంటున్నారు. చంద్రబాబు దీక్ష సమయంలో మెడలో ఇసుక దండలు - చేతిలో కార్మికుల పనిముట్లు వంటి వాటితో సందడి సాగగా...పవన్ కళ్యాణ్ దీక్షలో వరికంకులు వంటి వాటితో సందడి నెలకొంది. దీంతో...ఈ ఇద్దరు ప్రతిపక్ష నేతల దీక్షల్లో ఒకే రీతిలో హడావుడి ఉందంటున్నారు.