Begin typing your search above and press return to search.
జగన్ కు లేఖ రాయడానికి అంత భయమెందుకు పవన్!
By: Tupaki Desk | 30 July 2019 1:08 PM GMTఏపీ సీఎం జగన్ మోహన రెడ్డికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ఓ సమస్య పరిష్కారం కోసం ఆయన లేఖ రాసినప్పటికీ ఎందుకో అందులో ధైర్యం కనిపించలేదు.. ప్రభుత్వాన్ని నిలదీయడం కానీ - డిమాండ్ చేయడం కానీ కనిపించలేదు.. లేఖ రాసినందుకు నన్ను క్షమించండి అని వేడుకుంటున్నట్లుగా లేఖలో మొదటి మూణ్నాలుగు లైన్ లలోనే వివరణ ఇచ్చుకుని.. ఆ తరువాతే సమస్యను ప్రస్తావించిన తీరు చూసినవారంతా ఇలా అయితే పవన్ ఎన్నటికీ నాయకుడు కాలేరని.. ప్రశ్నించడానికి జనసేన పుట్టిందని చెప్పే పవన్ తానే ప్రశ్నించడానికి భయపడితే ఇంక ఆ పార్టీ సిద్ధాంతానికి అర్థమేముందన్న ప్రశ్న వినిపిస్తోంది.
కొత్త ప్రభుత్వం సెటిల్ కావడానికి సమయం పడుతుంది కాబట్టి కనీసం 100 రోజులు సమయం ఇవ్వాలని తాను అనుకున్నప్పటికీ భవన నిర్మాణ కార్మికులు సమస్యల్లో ఉండడంతో తప్పనిసరై ఈ లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్నానని పవన్ ఆ లేఖలో రాశారు.
‘‘ఇసుక కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ పనులు ఆగిపోయిన సంగతి మీకు తెలుసు. ఫలితంగా ఏ రోజుకి ఆ రోజు రెక్కాడితేనే గాని డొక్కాడని భవన నిర్మాణ కార్మికులు అల్లాడిపోతున్నారు. గత కొద్ది రోజులుగా వీరి నుంచి మా పార్టీకి అనేక వినతిపత్రాలు అందాయి. ఈ రోజు స్వయంగా కొందరు కార్మికులు మంగళగిరి జనసేన కార్యాలయంలో నన్ను కలసి వారి బాధలను వెళ్లబోసుకుని కన్నీరు పెట్టుకున్నారు. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి ఇసుకపై ప్రభుత్వ పాలసీని ప్రకటిస్తామని మీరు ప్రకటించి ఉన్నారు. అయితే అప్పటిదాకా కూలీ - నాలి చేసుకునే కార్మికులు పస్తులుండే పరిస్థితి నెలకొంది. ఇది మన రాష్ట్రానికి క్షేమకరం కాదు. అందువల్ల వీరిని తక్షణం ఆదుకుని వారికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వారి భృతికి భరోసా కల్పించవలసిన అవసరం ఉంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక మైనింగ్ అవకతవకలపై నేను అనేక సందర్భాలలో మాట్లాడడం జరిగింది. మీరు తీసుకువచ్చే కొత్త ఇసుక మైనింగ్ పాలసీ ఎటువంటి అవకతవకలకు అవకాశం ఇచ్చేలా ఉండరాదని జనసేన పార్టీ కోరుతోంది. ఇళ్లను నిర్మించుకునే ప్రజలు - కాంట్రాక్టర్లు - కార్మికులకు అనుకూలంగా మీ ఇసుక పాలసీ ఉన్నట్లయితే, అటువంటి పాలసీకి జనసేన పార్టీ కూడా మద్దతు ఇస్తుంది. ఇసుక పాలసీ రావడానికి ఇంకా కొంతసమయం ఉన్నందున తక్షణం భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని జనసేన పార్టీ కోరుతోంది’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.