Begin typing your search above and press return to search.

జ‌ర్న‌లిజం పాఠాలు చ‌దువుతున్న ప‌వ‌న్‌

By:  Tupaki Desk   |   28 April 2018 9:08 AM GMT
జ‌ర్న‌లిజం పాఠాలు చ‌దువుతున్న ప‌వ‌న్‌
X
ఒక మూడు రోజుల పాటు పొద్దున లేచిందే త‌డువు... నిద్ర‌పోయే వ‌ర‌కు త‌న‌ను విమ‌ర్శిస్తున్న కొన్ని మీడియాల‌పై దుమ్మెత్తి పోసి అనేక ఆరోప‌ణ‌లు చేసిన ప‌వ‌న్ త‌ర్వాత సైలెంట‌య్యారు. తీవ్ర విమ‌ర్శ‌ల నుంచి శాంతించి... స‌రే అయిపోయిందేందో అయ్యింది. ఇదిగో ఈ పుస్త‌కాలు చ‌ద‌వండి అని కొన్ని నీతి పుస్త‌కాల జాబితా చెప్పారు. ఆ త‌ర్వాత అందులోని కొన్ని ముఖ్య విషయాల‌ను తానే అండ‌ర్ లైన్ చేసి క‌నీసం ఇవైనా చ‌ద‌వండి అన్న‌ట్టు వాటిని పోస్టు చేశారు.

అయితే, మీడియా ప్ర‌జాస్వామ్యానికి నాలుగో స్తంభం కావ‌చ్చు కానీ దానిని న‌డిపేది కూడా మ‌నుషులే కాబ‌ట్టి కొన్ని త‌ప్పులు దొర్ల‌డం నిజ‌మే కానీ విస్మ‌యం అయితే కాదు. కాక‌పోతే జ‌నాల‌ను ప్ర‌భావితం చేసే వ్య‌వ‌స్థ‌ల‌ను న‌డుపుతున్న‌పుడు మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం అయితే ఉంది. అయితే, దానిని గుర్తించి స‌రిచేసుకొమ్మ‌ని ఎవ‌రైనా స‌ల‌హా ఇవ్వొచ్చు. అందులో త‌ప్పులేదు. కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆ మార్గాన్ని ఎంచుకోలేదు. ఏకంగా అట్లా ఎట్లా చేస్తారు అంటూ దాడిచేశారు. కంటెంట్ ప‌రంగా ఎదురుదాడి చేశారు. ఇదిగో మీరు చేసిన త‌ప్పులంటూ ఎత్తిచూపారు.

అయితే అనంత‌రం మీడియా అత‌డిపై కేసులు పెట్టింది. అందులో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏంటంటే... అస‌లు ప‌వ‌న్ పెట్టిన వీడియో త‌మ మీడియాలో ప్ర‌సారం కాలేదని ఆయా మీడియా సంస్థ‌లు చెబుతున్నాయి. *అది వాళ్ల సృష్టి* అని ప‌వ‌న్‌ పై కేసు రాశాయి. తిట్టుని బీప్ చేసిన త‌ర్వాతే ప్రసారం చేసిన‌ట్టు వారు పేర్కొంటున్నారు.

అద‌లా ఉంచితే, మీడియా నుంచి ఇంకా ప‌వ‌న్ దృష్టి మ‌ర‌లలేద‌ని తాజా ట్వీట్ ద్వారా అర్థ‌మ‌వుతోంది. మీడియా వాళ్ల‌కు ఎవ‌రూ నేర్ప‌ట్లేదేమో అని అనుకుని తానే పాఠాలు చెప్ప‌డం మొద‌లుపెట్టాడు. కొన్ని స‌ల‌హాలు కూడా ఇస్తున్నాడు. తాజాగా ఒక ట్వీట్ పెట్టిన ప‌వ‌న్ అందులో ఇలా చెప్పారు. *మొన్న చెప్పిన పాయింట్ కంటే ఇది బాగుంది. మీడియా సంస్థ‌లు అవ‌స‌రానికి మించి స్వేచ్ఛ వాడుకోవ‌డానికి ఏ నైతిక‌త అనుమ‌తించ‌డం లేదు. మీడియాకు పూర్తి స్వేచ్ఛ ఉండాలి కానీ.. న్యాయ‌వాదుల‌కు - అక్కౌంటెంట్ల‌కు ఉన్న‌ట్లే వీరు కూడా ఏదైనా ఒక బాధ్య‌తాయుత సంస్థ‌కు అనుబంధ‌మై ఉండాలి. మీడియా కోసమే మీడియా స‌రైన దారిలో న‌డ‌వ‌డాన్ని ప‌రిశీలించి క‌ట్ట‌డిచేసే ఒక స్వ‌తంత్ర వ్య‌వ‌స్థ ఉంటే మంచిది. ఎందుకంటే మీడియా ఒక వ్యాపారం కాదు. ఒక వృత్తి. వృత్తి నిపుణులు ప్ర‌మాణాలు పాటించ‌డానికి స‌ర్వ‌దా సిద్ధంగా ఉండాలి. ఉన్న‌త‌ విలువ‌ల‌ను క‌లిగి ఉండాలి* అంటూ అర్థాన్నిచ్చే ఒక పేరాను ప‌వ‌న్ ట్వీట్ చేశారు. మొత్తానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీడియా-దాని న‌డ‌వ‌డిక‌పై ఒక థీసిస్ స‌మ‌ర్పించేలా ఉన్నాడు చూస్తుంటే!