Begin typing your search above and press return to search.

అఫిషియ‌ల్ః జ‌న‌సేన‌కు ఈసీ గుర్తింపు

By:  Tupaki Desk   |   28 Oct 2015 12:44 PM GMT
అఫిషియ‌ల్ః జ‌న‌సేన‌కు ఈసీ గుర్తింపు
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్థాపించిన జ‌నసేన పార్టీకి రాజ‌కీయ పార్టీ గుర్తింపు ద‌క్కింది. తెలంగాణ రాష్ర్ట ఎన్నిక‌ల సంఘం ఈ మేర‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. ప్ర‌త్యేక గుర్తులేని పార్టీగా జ‌న‌సేన‌ను న‌మోదు చేసుకున్న‌ట్లు తాజాగా ఉత్త‌ర్వులు జారీచేసింది.

గ‌తంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్య‌క్తి తాను ఇప్ప‌టికే జ‌న‌సేన పేరుతో పార్టీని రిజిస్ట‌ర్ చేసుకున్నాన‌ని అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. దీంతో ఇన్నాళ్లు గుర్తింపు ప్ర‌క్రియ‌లో జాప్యం జ‌రిగింది. తాజాగా ఈ ప్ర‌క్రియ ముగిసిన నేప‌థ్యంలో త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో పోటీచేసే అవకాశం ద‌క్క‌నుంది. ఎన్నిక‌ల సంఘం వ‌ద్ద ఉండే ఫ్రీ సింబ‌ల్స్‌నుంచి ఎన్నిక‌లు జ‌రిగే స‌మ‌యంలో గుర్తును ఎంచుకోవాల్సి ఉంటుంది.