Begin typing your search above and press return to search.
'ఇప్పటం'పై పవన్‌కు పెద్ద తంటా.. తాజా అప్డేట్ ఇదే!
By: Tupaki Desk | 24 Nov 2022 9:31 AM GMTగుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ఇప్పటంగ్రామంలో తన పార్టీకి భూములు ఇచ్చిన రైతులను ప్రభుత్వం వేధిస్తోందని, వారి ఇళ్లు కూలగొడుతోందని పేర్కొంటూ.. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన జనసేనాని పవన్ కళ్యాణ్‌కు పెద్ద సంకటమే వచ్చి పడింది. ఆయన ఇక్కడ ఇళ్లు కూలగొట్టిన సమయంలో పర్యటించి.. బాధితుల పక్షాన కూడా మాట్లాడారు. ప్రభుత్వం అన్యాయంగా కూలుస్తోందని అన్నారు.
సరే.. ఈ విషయంలో.. ఏం జరిగిందో ఏమో కానీ, తాజాగా ఇప్పటం' కేసులో పిటిషనర్లపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటం గ్రామంలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై హైకోర్టుకు వెళ్లిన పిటిషనర్లకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున హైకోర్టు జరిమానా విధించింది.
కోర్టును తప్పుదోవ పట్టించినందుకు 14 మందికి 14 లక్షలు జరిమానా కోర్టు విధించింది. అక్రమ నిర్మాణాలను తొలగించడానికి అధికారులు నోటీసులు ఇచ్చినా.. ఇవ్వలేదని కోర్టుకు అబద్ధం చెప్పి పిటిషనర్లు స్టే తెచ్చుకున్నారు.
కాగా, షోకాజ్ నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లు కూల్చేస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించిన యజమానులు చివరకు వాస్తవాన్ని హైకోర్టుకు నివేదించారు. అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారని ఇళ్ల యజమానుల తరఫు న్యాయవాది హైకోర్టు ముందు అంగీకరించారు. దీంతో వారిపై హైకోర్టు మండిపడింది.
షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పటికీ, ఇవ్వలేదంటూ కోర్టుకొచ్చి, కూల్చివేతలపై స్టే పొందడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని అసహనం వ్యక్తం చేసింది. క్రిమినల్ కోర్టు ధిక్కరణ కింద చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరించాలని పిటిషనర్లను ఆదేశించింది. పిటిషనర్లు స్వయంగా తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది.
గురువారం విచారణ చేపట్టిన కోర్టు.. పిటిషనర్లకు జరిమానా విధించింది. ఇక, ఇప్పటంలో పర్యటించి బాధితులకు రూ.లక్ష చొప్పున పంపిణీ చేసేందుకు పవన్ ఈ నెల 27న ఇక్కడ పర్యటించాలని నిర్ణయించుకున్నారు. మరి తాజా తీర్పు నేపథ్యంలో ఆయన ఏం చేస్తారో చూడాలి. పైగా.. ఇప్పుడు వైసీపీకి అవకాశం చిక్కినట్టు అయింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.