Begin typing your search above and press return to search.
ఎంపీ రామ్మోహన్ హిందీ వెనుక పవన్.?
By: Tupaki Desk | 24 July 2018 11:06 AM GMTపవన్ కళ్యాణ్ విమర్శలు టీడీపీ ఎంపీలపై బాగానే పనిచేశాయని అర్థమవుతోంది.. పవన్ చాలాసార్లు టీడీపీ ఎంపీలు పార్లమెంటులో క్రియాశీలకంగా పనిచేయడం లేదని.. హిందీ మాత్రమే వచ్చే కేంద్రంలోని పెద్దల వద్ద ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారని.. వారికి టీడీపీ ఎంపీల బాధ అర్థం కావడం లేదని విమర్శించారు. టీడీపీ ఎంపీలకు హిందీ రాకపోవడం వల్ల ఏపీకి కావాల్సిన పనులు కూడా జరగడం లేదనే విమర్శలున్నాయి.. టీడీపీ ఎంపీల్లో చాలామందికి హిందీ రాదు.. ఇంగ్లీష్ లో అదరగొడతారు. ఇకపోతే ఢిల్లీని పాలించే హిందీ పెద్దలకు ఇంగ్లీష్ రాదు.. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ తో ఏపీకి తీరని అన్యాయం జరుగుతోందంటూ పవన్ అప్పట్లో ఎద్దేవా చేశారు.
పవన్ అన్న మాటలు బాగానే పనిచేశాయి.. తెలుగు - ఇంగ్లీష్ లో మాత్రమే ఇరగదీసే టీడీపీ ఎంపీలు ఇప్పుడు హిందీ నేర్చుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి... తాజాగా ఆవిశ్వాసం సందర్భంగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు హిందీలో అదరగొట్టారు. కేంద్రంలోని పెద్దలకు అర్థమయ్యే రీతిలో హిందీలో మాట్లాడి విరుచుకుపడ్డారు..
అంతకు ఆరునెలల ముందు నుంచి రామ్మోహన్ నాయుడు హిందీ భాషపై కసరత్తు చేసినట్టు ఆయన సన్నిహితులు ప్రచారం చేస్తున్నారు. పవన్ అన్న మాటలను సీరియస్ గా తీసుకొని రామ్మోహన్ నాయుడు కష్టపడి హిందీ నేర్చుకొని పార్లమెంటులో అవిశ్వాసం అందరికీ అర్థం అయ్యేలా మాట్లాడరని చెబుతున్నారు. మొత్తానికి ఏదీ ఏమైతేనే పవన్ తిట్టిన తర్వాతైనా టీడీపీ ఎంపీల వైఖరిలో మార్పు వచ్చి రాష్ట్రానికి న్యాయం జరగడం కోసం ఇప్పటికైనా హిందీ నేర్చుకుంటున్నారని.. అదే చాలని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.