Begin typing your search above and press return to search.

పవన్ అజ్ఞాతవాసి కాదు ఒక అజ్ఞాని ..!

By:  Tupaki Desk   |   5 Dec 2019 5:51 AM GMT
పవన్ అజ్ఞాతవాసి కాదు ఒక అజ్ఞాని ..!
X
పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి కదా ? ఒక అజ్ఞానినా ? అవును.. పవన్ కళ్యాణ్ పొద్దున్న లేచినప్పటి నుండి నేను కొన్ని వేల పుస్తకాలు చదివాను .. అని చెప్తుంటారు కదా ..మరి అజ్ణాని ఎలా అయ్యారు? అని ఆలోచిస్తున్నారా ..అదేంలేదండి ..పవన్ కళ్యాణ్ ఎన్నికలు ముగిసిన తరువాత కొద్దిరోజులు సైలెంట్ గా ఉండి ..మళ్లీ ఈ మద్యే పార్టీ నిర్మాణం అంటు కొత్త పల్లవి ఎత్తుకున్నారు. ప్రస్తుతం రాయలసీమ పర్యటన చేస్తున్న పవన్ ..వైసీపీ ప్రభుత్వం పై , సీఎం జగన్ పై తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ నేను అసలు జగన్ ని సీఎం గా గుర్తించలేదు అని అంటున్నాడు. జగన్ రాజ్యాంగ బద్దంగా ఎన్నికై ..ఏపీ సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన తరువాత కూడా ఒక పార్టీ అధినేతగా ఉంటూ జగన్ నా దృష్టిలో సీఎం కాదు అంటే అజ్ణాని కాక ... చదువుకున్న జ్ఞానీ అవుతారా ..? అసలు పవన్ జగన్ ని ఏమన్నారు ..పవన్ ని అజ్ణాని అని అన్నది ఎవరు అనేది ఇప్పుడు చుద్దాం ..

రాయలసీమ పర్యటనలో పవన్ కళ్యాణ్ ..సీఎం జగన్ పై తీవ్రమైన ఆరోపణలు , విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌ సీఎం పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై గ్రంథి శ్రీనివాస్‌ మండిపడ్డారు. భీమవరంలో పవన్ కళ్యాణ్ పై గ్రంది శ్రీనివాస్ విజయం సాదించిన సంగతి తెలిసిందే. ఆయన మాట్లాడుతూ... పిచ్చి కల్యాణ్‌ నీకు బుర్ర ఉందా లేదా పిచ్చి పట్టిందా అని ప్రశ్నించారు. 'సీఎం జగన్‌ను ముఖ్యమంత్రిగా పవన్‌ గుర్తించడట. పవన్‌ నీకు అసలు రాజ్యాంగం గురించి తెలుసా. ఎవరిని అవమానిస్తున్నావో తెలుసా. డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి లోబడి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో 51 శాతం ప్రజలు వైఎస్‌ జగన్‌కు ఓటేసి గెలిపిస్తే ముఖ్యమంత్రిగా అంగీకరించనంటావా. రాజ్యాంగాన్ని, అంబేద్కర్‌ను దారుణంగా అవమానించావు. దీనికి బేషరతుగా క్షమాపణ చెప్పు అని పవన్‌ కల్యాణ్‌ను డిమాండ్‌ చేశారు. నీకు టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు పవిత్రులు. వైఎస్సార్సీపీ లో గెలిచిన వారు అపవిత్రులా అని అయన ప్రశ్నించారు.

దిశ ఘటనపై పవన్‌ చేసిన వ్యాఖ్యల పై కూడా గ్రంథి శ్రీనివాస్‌ ఫైర్‌ అయ్యారు. 'తల్లులను, స్త్రీలను గౌరవించని వాళ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కేరాఫ్ అడ్రస్ జనసేన. ఆంధ్రప్రదేశ్‌కు దరిద్రం పట్టిందనడానికి జనసేన పార్టీ ఓ నిదర్శనం. నిన్ను ఆదర్శంగా తీసుకున్న వాళ్లు అసభ్యకరమైన, అసాంఘిక శక్తులుగా మారుతున్నారు. నువ్వు పోటీ చేసిన రెండుచోట్లా నీ పిచ్చి, తిక్క, లెక్క మాకు వద్దంటూ ప్రజలు నిన్ను తరిమికొట్టారు. అయినా నీకు సిగ్గురాలేదు. రోజురోజుకూ దిగజారి పోతున్నావు అంటు తీవ్రంగా పవన్ పై విరుచుకు పడ్డాడు. ఈ తరుణంలోనే పవన్ అజ్ఞాతవాసి కాదు ఒక అజ్ఞాని అంటు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.