Begin typing your search above and press return to search.
న్యాయవాదులూ....నాతో రండి..
By: Tupaki Desk | 27 July 2018 7:28 AM GMT"ముఖ్యమంత్రి కొడుకు - ముఖ్యమంత్రే కావాల...ప్రధాని కొడుకు ప్రధానే కావాల.. ఓ పేద రైతు కూలి కొడుకు ప్రధాని కాకూడదా..? ఒక మాములు లాయర్ కొడుకు ముఖ్యమంత్రి కాకూడదా.....?" అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ప్రస్తుత సమాజంలో ఉన్న అవినీతి - పెత్తందారితనంపై పవన్ అవేదన వ్యక్తం చేసారు. నిన్న పశ్చిమ గోదవరి జిల్లాలోని భీమవరంలో లాయర్లతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, న్యాయవాదులందరూ రాజకీయాలోకి రావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. రాజ్యంగం రాసిన బి.ఆర్. అంబేద్కర్ కూడా ఒక న్యాయవాదే - అని పవన్ గుర్తుచేసారు. న్యాయవాదుల గొంతు న్యాయస్థానంలో నాలుగు గోడల మధ్య ఉండిపోకూడదని పవన్ దిశానిర్దేశం చేసారు. న్యాయవాదులనందరూ ప్రత్యక్షంగా రాజకీయలలోకి రాకపోయినప్పటికీ వివిధ ప్రజా సమస్యల గురించి గళం విప్పాలని పవన్ చెప్పారు.
ఈ సమాజంలో ఉన్న కుళ్లు - కుతంత్రాలు చూసి - తాను ఈ దేశం నుంచి వెళ్లిపోదామని అనుకున్నానని - కాని ఈ సమాజంలో ఉన్న సమస్యలను తానే ఎందుకు పరిష్కరించుకూడదు అని తనకి తానే ప్రశ్నించుకుని, సమాజానికి ఏదో మంచి చేయాలనే తపనే తనను రాజకీయాల వైపు మళ్లించిందని అన్నారు. ఈ సమాజంలో సమస్యలతో పోరాడడానికి న్యాయవాదులందరూ తనతో రావలని ఆయన కోరారు. వచ్చే ఎన్నికలలో - యువతతో పాటు న్యాయవాదుల మదత్తును కూడగట్టుకునేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. అయితే సమావేశానికి హాజరైన న్యాయవాదులందరూ పవన్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నప్పటికీ - రాబోయే ఎన్నికలలో జనసేనతో కలసి నడుస్తారా ...లేదా...అన్నది వేచి చూడాలి.