Begin typing your search above and press return to search.

జ‌న‌సేనాని... ఇండిపెండెన్స్ డే ట్వీట్లు చూశారా?

By:  Tupaki Desk   |   14 Aug 2017 12:18 PM GMT
జ‌న‌సేనాని... ఇండిపెండెన్స్ డే ట్వీట్లు చూశారా?
X
టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోమారు ట్విట్ట‌ర్‌ లో ప్ర‌త్య‌క్ష‌మైపోయారు. అయితే ఎప్పుడు సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మైన ఏదో ఒక అంశంపై కాస్తంత వేడి పుట్టేలా ప్ర‌వ‌ర్తించే ప‌వ‌న్ క‌ల్యాణ్‌... ఈ ద‌ఫా మాత్రం జాతీయ స‌మైక్య‌త‌ను చాటి చెబుతూ ట్వీట్లు చేయ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయింది. అయినా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు ట్విట్ట‌ర్ లో ప్ర‌స్తావించిన అంశం ఏంట‌న్న విష‌యానికి వ‌స్తే... రేపు భార‌త దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన రోజు.

ఈ శుభ గ‌డియ‌ను ప్ర‌స్తావిస్తూ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. దేశ ప్ర‌జ‌ల‌కు స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు చెప్పిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌... అదే స‌మ‌యంలో ఇండిపెండెన్స్ డే ఇంపార్టెన్స్ ఏమిటో కూడా చెప్పేశారు. జాతికి ఇదొక్క‌టే ఘ‌న‌మైన పండుగ అంటూ ప‌వ‌న్ చేసిన ట్వీట్ ఇప్పుడు నిజంగానే ఆస‌క్తి రేకెత్తిస్తోంది. కాసేప‌టి క్రితం ట్విట్ట‌ర్‌లో ప్ర‌త్య‌క్ష‌మైన ప‌వ‌న్ క‌ల్యాణ్‌... ఇండిపెండెన్స్ డే ప్ర‌త్యేక‌త‌ను చాటుతూ వ‌రుస ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్ల సారాంశం ఇలా సాగింది.

"మన దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు. వ్యక్తులకు భిన్నమైన పర్వదినాలు ఉండొచ్చు. కానీ జాతికి సంబంధించి ఇదొక్కటే ఘనమైన పండుగ రోజు. జైహింద్‌!' అని కల్యాణ్‌ తన ట్విట్టర్‌ లో రాశారు. దక్షిణాదిపై ఉత్తరాది పెత్తనం చెలాయిస్తోందని ఆగ్రహిస్తూ ప‌లుమార్లు ఇదే ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్టులు పెట్టిన పవన్‌.. స్వాతంత్ర్యదినోత్సవం ఒక్కటే జాతికి ఘనమైన పండుగ అంటూ ఇప్పుడు త‌న‌ జాతీయ భావాన్ని చాటుకోవడం నిజంగానే ఆస‌క్తిక‌రంగా ఉంద‌ని చెప్ప‌క త‌ప్పదు.