Begin typing your search above and press return to search.
పవనాలు.. అక్కా అంటివి.. ఇలా చేస్తివి!
By: Tupaki Desk | 12 April 2021 9:28 AM GMTవకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయ్యింది.. అంతటా ఆ సినిమా బృందం, మెగా ఫ్యామిలీ సందడి చేస్తుంటే.. అందులో నటించిన హీరో పవన్ మాత్రం మిస్సింగ్. పవన్ ఎందుకు రావడం లేదు అయ్యా.. అంటే.. పవన్ కు సన్నిహితులు, సిబ్బంది అందరికీ కరోనా సోకిందని.. ముందు జాగ్రత్త చర్యగా పవన్ సైతం హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయాడని జనసేన అధికారికంగా తెలిపింది.
అయితే పవన్ కు కరోనా సోకిందా? లేదా? సన్నిహితులకు వచ్చిందని క్వారంటైన్ వెళ్లిపోయాడా? టెస్ట్ చేయించుకున్నాడా? పాజిటివ్ నా? అన్నది మాత్రం జనసేన తెలుపడం లేదు. సన్నిహితులకు రావడంతో పవన్ క్వారంటైన్ వెళ్లాడు అంటోంది.
పవన్ క్వారంటైన్ లో ఉన్నా ఇప్పుడు వకీల్ సాబ్ సినిమా బృందం మాత్రం ప్రమోషన్ లో పాల్గొంటోంది. ఇక సినిమాకు కలెక్షన్లు ఆగడం లేదు. సందడి అలాగే ఉంది. పవన్ రాకుంటే ఏం ఫికర్ పడడం లేదు.
కానీ పవన్ రాకుంటే ఎక్కువగా దెబ్బ పడేది తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి రత్నప్రభకే. ఏప్రిల్ 3న పవన్ వచ్చి ర్యాలీ తీసి సభలో జగన్ ను, వైసీపీని తిట్టాక బీజేపీకి ఫుల్ హైప్ వచ్చింది. జనసైనికుల్లో బీజేపీ నేతల్లో ఉత్సాహం వచ్చింది. అయితే ఇప్పుడు పవన్ ఎన్నికల ప్రచారానికి రాడని తెలిసి బీజేపీ తెగ కంగారుపడుతోంది.
మళ్లీ 12న సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సహా అమిత్ షా ఇంకొందరు పెద్దలు వస్తున్నారని తెలిసినా పవన్ మాత్రం క్వారంటైన్ తో రావడం లేదని తెలుస్తోంది. దీంతో పవన్ రాకుంటే జనసైనికులు సహకరిస్తారా? ఓట్లు బీజేపీకి పడుతాయా? అన్న టెన్షన్ బీజేపీలో నెలకొంది. ముఖ్యంగా తమ్ముడూ పవన్ అని నోరార పిలిచిన రత్నప్రభ ఇప్పుడు పవన్ క్వారంటైన్ తో తెగ ఆందోళన పడుతోందట.. తమ్ముడు రాకపోతే అక్కకే బాగా టెన్షన్ పట్టుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.