Begin typing your search above and press return to search.

పవన్ కల్యాణ్ మరో హెచ్చరిక జారీ చేశారు!

By:  Tupaki Desk   |   29 Jun 2019 4:34 AM GMT
పవన్ కల్యాణ్ మరో హెచ్చరిక జారీ చేశారు!
X
జనసేన అధిపతి మరో హెచ్చరిక జారీ చేశారు. అయితే అది సూటిగా ఎవరికో చెప్పలేదు కానీ, జనసేన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న వారికి అని మాత్రం పవన్ ప్రకటించారు. ఎన్నికలు అయ్యాకా కొన్ని ప్రాంతాల్లో జనసేన కార్యకర్తలపై దాడులు జరుగుతూ ఉన్నాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

భీమవరం, నరసాపురం తదితర ప్రాంతాల్లో జనసేన కార్యకర్తలను కొంతమంది వేధిస్తున్నారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. జనసేనకు సపోర్ట్ చేశారని వారిపై వేధింపులు సాగుతున్నాయని, ఆ తీరు మానుకోవాలని పవన్ హెచ్చరించారు.

అవసరం అయితే తనే రంగంలోకి దిగి జనసైనికులకు అండగా నిలబడబోతున్నట్టుగా పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇలా హెచ్చరించారు పవన్ కల్యాణ్. ఇక జూలై పదిహేను నుంచి పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు మొదలుపెట్టబోతున్నట్టుగా పవన్ కల్యాణ్ ప్రకటించారు. నరసాపురం నియోజకవర్గం నుంచినే సమీక్ష మొదలవుతుందని వివరించారు.

ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన లోక్ సభ అభ్యర్థితో పాటు.. శాసనసభ అభ్యర్థులు, ఇతర ముఖ్య నేతలందరితోనూ సమీక్ష నిర్వహించబోతున్నారట పవన్ కల్యాణ్. ఇక వివిధ నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలను ప్రారంభించనున్నట్టుగా జనసేన అధిపతి పేర్కొన్నారు.

మరోవైపు పవన్ కల్యాణ్ తానా సభలకు హాజరవుతున్నట్టుగా తెలుస్తోంది. జూలై రెండు నుంచి ఆరు వరకూ సాగే ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి పవన్ కల్యాణ్ అమెరికా వెళ్లబోతున్నారని సమాచారం.