Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ విజ‌న్ 2043లో బాబు క‌నిపించ‌ట్లేదు?

By:  Tupaki Desk   |   27 July 2018 6:13 AM GMT
ప‌వ‌న్ విజ‌న్ 2043లో బాబు క‌నిపించ‌ట్లేదు?
X
బాబు నోటి నుంచి కొన్ని ల్యాండ్ మార్క్ మాట‌లు వినిపిస్తూ ఉంటాయి. తొమ్మిదిన్న‌రేళ్ల పాటు సీఎంగా ఉన్న వేళ‌లో బాబు నోటి నుంచి త‌ర‌చూ విజ‌న్ 2020 మాట త‌ర‌చూ వ‌స్తూ ఉండేది. ఏపీని అన్ని ర‌కాలుగా అభివృద్ధి చేస్తాన‌ని.. ఇందుకు త‌గ్గ‌ట్లే తానో భారీ ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేశాన‌ని.. దాని ప్ర‌కారం పోతే 2020 నాటికిఏపీ మొత్తం అద్భుతంగా మార‌ట‌మే కాదు. అభివృద్ధిలో దూసుకెళ్ల‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది.

తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట‌ల్ని చూస్తే.. బాబు చెప్పే విజ‌న్ 2020ను త‌ల‌పించేలా మాట్లాడ‌టం క‌నిపిస్తుంది. ప్ర‌జారాజ్యం రోజుల్లో ప‌వ‌న్ మాట్లాడుతూ.. ఒక‌వేళ ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోతే తాను స‌న్యాసం తీసుకుంటాన‌ని చెప్ప‌టం తెలిసిందే. అవ‌స‌రానికి త‌గ్గ‌ట్లుగా మాట‌ల్ని.. నినాదాల్ని మార్చేసే బాబు మాదిరే ప‌వ‌న్ కూడా అదే బాట ప‌ట్టిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

తొమ్మిదిన్న‌రేళ్ల పాటు సీఎంగా ఉన్న వేళ‌లో విజ‌న్2020 చెప్పిన బాబు.. 2014లో అధికారంలోకి వ‌చ్చినంత‌నే త‌న విజ‌న్ 2020 కాస్తా 2050కు మార్చేయ‌టం తెలిసిందే. అదేమంటే.. తాను ప‌వ‌ర్లో ప‌దేళ్లు లేన‌ని.. ఆ సంద‌ర్భంగా జ‌రిగిన డ్యామేజ్ ను ఒక కొలిక్కి తెచ్చి మ‌ళ్లీ అభివృద్ధి ప‌థంలోకి తీసుకెళ్లాలంటే ఆ మాత్రం టైం కావాల‌న్న మాట‌ను చెప్ప‌టం క‌నిపిస్తూ ఉంటుంది.

తాజాగా ప‌వ‌న్ సైతం బాబు మాదిరే మాట్లాడ‌టం గ‌మ‌నార్హం. త‌న‌ను క‌లిసిన అభిమానులు... పార్టీ నేత‌ల‌తో మాట్లాడిన సంద‌ర్భంగా రాజ‌కీయాల్లో మార్పుల కోసం పాతికేళ్లు పోరాడితే కానీ.. ప‌రిస్థితుల్లో ఎంతోకొంత మార్పు వ‌స్తుంద‌న్న ఆణిముత్యం లాంటి మాట‌ను చెప్ప‌టం క‌నిపిస్తుంది. బాబు మాదిరి దీర్ఘ‌కాల విజ‌న్ పెట్టుకొని బండి న‌డిపించే దిశ‌గా ప‌వ‌న్ అడుగులు ప‌డుతున్నాయ‌న్నట్లుగా ఆయ‌న తాజా వ్యాఖ్య ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.