Begin typing your search above and press return to search.

జ‌న‌సేన టికెట్ల ఎంపిక‌లో వారికే ప్రాధాన్య‌త‌?

By:  Tupaki Desk   |   12 Feb 2019 7:58 AM GMT
జ‌న‌సేన టికెట్ల ఎంపిక‌లో వారికే ప్రాధాన్య‌త‌?
X
ఎన్నిక‌ల వేడి ఏపీకి ప‌ట్టేసింది. నోటిఫికేష‌న్ విడుద‌ల కాన‌ప్ప‌టికీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన వ్యూహాన్ని సిద్ధం చేసుకోవ‌టంలో పార్టీల‌న్నీ ఫుల్ బిజీగా మారాయి. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌లైన వెంట‌నే చేయాల్సిన క‌స‌ర‌త్తుకు సంబంధించిన వ్యూహాల్ని ఇప్ప‌టికే సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా అభ్య‌ర్థుల ఎంపిక‌కు సంబంధించిన క‌స‌ర‌త్తు అన్ని పార్టీలు చేస్తున్నాయి.

మిగిలిన పార్టీల‌కు జ‌న‌సేన‌కు ఒక పెద్ద వ్య‌త్యాసం ఉంది. ఏపీ అధికార‌.. విపక్ష అధినేత‌ల‌కు నియోజ‌క‌వ‌ర్గాల వారీగా లెక్క‌లు.. అభ్య‌ర్థులు ఎవ‌రైతే మంచిద‌న్న దానిపై పూర్తి అవ‌గాహ‌న ఉంది. కానీ.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కు ఆ విష‌యంలో చాలానే ఇబ్బందులు ఉన్నాయి. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మీక‌ర‌ణ‌లు.. బ‌లాబ‌లాలు.. ప్ర‌త్య‌ర్థి అభ్య‌ర్థులు.. వారి వ్యూహం ఏమిట‌న్న విష‌యాన్ని గుర్తించే విష‌యంలో ఆయ‌న‌కు చాలానే స‌మ‌స్య‌లు ఉన్నాయి.

దీన్ని అధిగ‌మించేందుకు వీలుగా త‌న‌కు అత్యంత స‌న్నిహితంగా ఉన్న కొంద‌రిని క‌మిటీగా ఏర్పాటు చేసి.. టికెట్ల పంపిణీకి సంబంధించిన వ్య‌వ‌హారాలు చూసేందుకు ఏర్పాటు చేశారు.

పార్టీ టికెట్ ఆశించే వారిని షార్ట్ లిస్ట్ చేయ‌టం.. బ‌లాబ‌లాల్ని చెప్ప‌టం.. గెలుపు లెక్క‌లు వేయ‌టం లాంటి ప‌నులు ఈ క‌మిటీ చేస్తుంద‌ని చెప్పాలి. అయితే.. ప్ర‌జారాజ్యంలో మాదిరి కాకుండా..జ‌న‌సేన‌లో ప‌వ‌న్ ఫ్యాన్స్ కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌న్న ఆలోచ‌న‌లో ప‌వ‌న్ ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఏదైనా స్థానంలో ఇరువురుఅభ్య‌ర్థుల బ‌లాబ‌లాలు స‌మానంగా ఉండి.. అందులో ఒక అభ్య‌ర్థి బ్యాక్ గ్రౌండ్ లో ప‌వ‌న్ ఫ్యాన్ అయితే.. అత‌నికే ఖాయంగా టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేయాల‌న్న ఆలోచ‌న‌లో ప‌వ‌న్ ఉన్న‌ట్లు చెబుతున్నారు.

బ‌య‌ట వారితో పోలిస్తే.. త‌న‌ను అభిమానించి.. ఆరాధించే వారిని న‌మ్ముకోవ‌ట‌మే మంచిద‌న్న ఆలోచ‌న‌లో ప‌వ‌న్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎన్నిక‌ల బ‌రిలో దిగే జ‌న‌సేన గుర్రాలు ఎక్కువగా ప‌వ‌న్ ఫ్యాన్ బ్రాక్ గ్రౌండ్ ఉన్న వారికే ఇవ్వ‌టం మంచిద‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికి ఇలా అనుకుంటున్నా.. టికెట్ల పంపిణీలో అదే తీరును ప్ర‌ద‌ర్శిస్తారా? వ్యూహం మారుస్తారా? అన్న‌ది చూడాలి.