Begin typing your search above and press return to search.

జనసేనకు ఆయనే పెద్ద దిక్కు?!

By:  Tupaki Desk   |   3 July 2019 11:45 AM GMT
జనసేనకు ఆయనే పెద్ద దిక్కు?!
X
పవన్ కల్యాణ్ తీరు ఏమిటో అందరికీ తెలిసిందే. కొన్ని రోజులు జనం మధ్య ఉండే సరికే పవన్ కల్యాణ్ తీరు మారిపోతూ ఉంటుంది. ఆయన మూడ్ ఉన్నప్పుడే జనం మధ్య ఉంటారు. ఆ మూడ్ లేనప్పుడు నెలలు అయినా బయటకు రాడు. పవన్ కల్యాణ్ ఈ తరహాలో వ్యవహరించడం కొత్త ఏమీ కాదు. గతం నుంచి ఇదే జరుగుతూ ఉంది.

అందుకే జనసేన పై ఇప్పటికీ జనాల్లో పూర్తి స్థాయిలో నమ్మకాలు కలగడం లేదు అనేది ఒక విశ్లేషణ. జనసేన లోకి ఎన్నికల ముందు నేతలు అంతగా చేరకపోవడానికి, చేరిన వారు కూడా నెగ్గకపోవడానికి కారణం పవన్ కల్యాణ్ ఒక్కోసారి ఒక్కోలా వ్యవహరించడమే అనే టాక్ ఉంది.

ఎన్నికల్లో షాకింగ్ రిజల్ట్స్ తర్వాత కూడా పవన్ కల్యాణ్ తీరులో పెద్దగా మార్పు లేనట్టుగా ఉంది. పవన్ కల్యాణ్ ఇప్పటికీ పూర్తి స్థాయిలో రాజకీయానికి సమయం కేటాయించడం లేదు.

దీంతో పార్టీలో పాత పరిస్థితే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు పార్టీలో కీలకమైన బాధ్యతలు మరొకరికి అప్పగించాలని భావిస్తున్నారట. అది మరెవరికో కాదు.. తన అన్నయ్య నాగబాబుకు.

పార్టీకి, కార్యకర్తలకు, ప్రజలకు ఎలాగూ పవన్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండరు కాబట్టి.. సమన్వయ కమిటీ అంటూ ఒకదాన్ని ఏర్పాటు చేసి దానికి అధ్యక్ష బాధ్యతలను తన సోదరుడికి అప్పగించనున్నారట. తద్వారా అటు పార్టీ తమ గ్రిప్ లో ఉండేందుకు, తరచూ ఏదో ఒక యాక్టివిటీ ఉండేందుకు ఉపయుక్తంగా ఉంటుందని పవన్ భావిస్తున్నాడట.

అయితే ఇలా సొంత సోదరుడికే పార్టీ బాధ్యతలు అప్పగించడం వల్ల మరో రకమైన విమర్శ వచ్చే అవకాశం ఉంది. అదే కుటుంబ పార్టీ ఇమేజ్. అయితే రాష్ట్రంలో అన్ని పార్టీలూ కుటుంబ పార్టీలుగానే నడుస్తూ ఉన్నాయి. జనసేన కూడా ఆ తానులో ముక్కే కదా!