Begin typing your search above and press return to search.
జగన్ దెబ్బకు!...పవన్ ఒప్పేసుకున్నాడబ్బా!
By: Tupaki Desk | 27 March 2019 4:11 PM GMTఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న సమయంలో రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అంతేకాకుండా ఆయా పార్టీలకు చెందిన కీలక నేతలు ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటూ - ఆరోపణలు గుప్పించుకుంటూ ఉంటున్న వైనం కూడా ఇప్పుడు బాగానే పెరిగిపోయింది. ఈ క్రమంలో ఇటీవల జనసేనాని పవన్ కల్యాణ్ ను వరుసగా టార్గెట్ చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఆయనను యాక్టర్ గానే కాకుండా టీడీపీకి భాగస్వామిగానూ అభివర్ణిస్తున్నారు. గతంలో పవన్ ను పెద్దగా పట్టించుకోని జగన్... ఎన్నికలు సమీపిస్తుండటం... టీడీపీ - జనసేనల మధ్య పొత్తు సూచనలు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబుతో పాటు పవన్ ను కూడా టార్గెట్ చేస్తున్నారు.
జగన్ వ్యాఖ్యలపై నిన్నటిదాకా పెద్దగా స్పందించని పవన్... వైసీపీపై ఆరోపణలే లక్ష్యంగా సాగారు. అయితే నేటి ప్రకాశం జిల్లా పర్యటనలోభాగంగా మార్కాపురంలో ప్రసంగించిన సందర్భంగా జగన్ తన పై సంధించిన విమర్శలకు కౌంటర్ ఇచ్చే యత్నం చేశారు. జగన్ ఆరోపిస్తున్నట్లుగా తాను యాక్టర్ నేనని పవన్ ఒప్పేసుకున్నారు. అంతటితోనే ఆగని పవన్... మరి జైల్లో ఉండి వచ్చిన జగన్ ను తాను ఏమనాలంటూ కొత్త ఆరోపణ చేశారు. బీజేపీకి రహస్య మిత్రుడిగా జగన్ ను అభివర్ణించాలా? అని కూడా పవన్ తనదైన శైలి ఆరోపణలు చేశారు.
ఈ సందర్భంగా పవన్ ఏమన్నారన్న విషయానికి వస్తే.... *నన్ను యాక్టర్ అంటూ - టీడీపీ భాగస్వామి అంటూ జగన్ పదే పదే ఆరోపిస్తున్నారు. మరి రెండేళ్ల పాటు జైల్లో ఉండి వచ్చిన జగన్ ను నేను ఏమనాలి? బీజేపీ - మోదీ - అమిత్ షా - టీఆర్ ఎస్ కు జగన్ దోస్త్ అనాలా? అవును నేను యాక్టర్ నే. నేనేమీ అదాటుగా రాజకీయాల్లోకి రాలేదు. ప్రజల సమస్యలపై అధ్యయనం చేశాకే వచ్చాను. 2009 నుంచి 2019 దాకా మూడు ఎన్నికలను ఎదుర్కొన్నాను. చదివింది పదో తరగతే అయినా... సమాజాన్ని బాగానే స్టడీ చేశా. అన్నవరం చిత్రం షూటింగ్ గ్యాప్ లో సమాజంపై అవగాహన కోసం ఎన్నో పుస్తకాలు చదివా. ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకున్నా. ఆ తర్వాతే రాజకీయాల్లోకి వచ్చా. మూడు ఎన్నికలు చూస్తున్న తాను కొత్త తరం నేతగా ఎదగుతున్నా* అంటూ పవన్ దీర్గాలు తీశారు. మొత్తంగా జగన్ చెప్పినట్లుగా తాను యాక్టర్ నేనని ఒప్పేసుకున్న పవన్... టీడీపీ భాగస్వామిగా తనను జగన్ ఆరోపించిన వైనంపై మాత్రం మాట మాత్రంగా కూడా ప్రస్తావించని పవన్ తన నిజ నైజాన్ని చాటుకున్నారని చెప్పాలి.