Begin typing your search above and press return to search.
హోదాపై పవన్... తత్వం బోధపడినట్టే!
By: Tupaki Desk | 6 Aug 2019 4:14 AM GMTఏపీకి ప్రత్యేక హోదాపై జనసేనాని పవన్ కల్యాణ్ కు ఇప్పటికి గానీ తత్వం బోధపడలేదన్న వాదన వినిపిస్తోంది. గతంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం తొలుత వైసీపీ ఉద్యమాన్ని ప్రారంభిస్తే... పవన్ కూడా తన వంతుగా ఉద్యమాన్ని కొనసాగించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుతో పాటు ఏపీలో నాటి అదికార పార్టీ టీడీపీని - నాడు విపక్షంలో ఉండి ప్రస్తుత అధికారంలో ఉండి ప్రత్యేక హోదా కోసం పోరు సాగించిన వైసీపీపై తనదైన శైలిలో విరుచుకుపడిన పవన్... ప్రధాని నరేంద్ర మోదీని ఓ రేంజిలో విమర్శించిన విషయం గుర్తుండే ఉంటుంది. నాడు పవన్ సాగించిన పోరు ఏపీ ప్రజల్లో కసిని రేకెత్తించిందనడంలో ఎలాంటి సందేహం లేదు గానీ... ఆ కసి ఓ ఉద్యమంలా మారడంలో మాత్రం సఫలం కాలేదు. ఇందుకు వేర్వేరు కారణాలున్నా... పవన్ మాత్రం తనవంతుగా పోరాటం అయితే చేశారు. అయితే ఇప్పుడు ఆయన హోదా పోరు నుంచి దాదాపుగా సైడైపోయారనే చెప్పాలి. ఏవరికీ అక్కర్లేని ప్రత్యేక హోదా తనకు మాత్రమే ఎందుకన్న కోణంలో ఆలోచించిన పవన్... హోదా పోరు నుంచి తప్పుకుంటున్రనట్లుగా చాలా విస్పష్టంగానే ప్రకటించేశారని చెప్పాలి.
ప్రత్యేక హోదా పోరు నుంచి తాను తప్పుకుంటున్నట్లు నేరుగా చెప్పని పవన్... అందరూ కలిసి వస్తేనే పోరు సాగిస్తానని - అలా కాకుండా తానొక్కడినే ఏం చేసేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సోమవారం పర్యటించిన సందర్భంగా పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు జనంలో - రాజకీయ నేతల్లో ప్రత్యేక హోదా సంకల్పం లేనప్పుడు తాను ఒక్కడినే పోరాటం చేస్తే ఏ ఫలితం వస్తుందని ఆయన ఒకింత నిర్వేదం వ్యక్తం చేశారు. నిజమే... పవన్ మాటల్లోనూ నిజం ఉందని చెప్పక తప్పదు. ఎందుకంటే...ఒక్కడు చేసే ఉద్యమానికి - ఓ సమూహం చేసే ఉద్యమానికి చాలా తేడా ఉంటుంది కదా. నిజమే... పవన్ కూడా ఇప్పుడు ఈ తత్వాన్ని అర్థం చేసుకున్నారు. తాను హోదా ఉద్యమం నుంచి తప్పుకుంటున్నానని పరోక్షంగానే ప్రకటించేశారు. అయితే ఈ తప్పుకోవడం శాశ్వతంగా కాదని, ప్రజల్లో - రాజకీయ పార్టీల నేతల్లో సంకల్పం కనిపించేదాకానేనని ఆయన తేల్చి చెప్పారు.
అయినా పవన్ ఈ దిశగా ఏమన్నారన్న విషయానికి వస్తే... తెలంగాణకు అన్యాయం జరిగిందని అక్కడి ప్రజలు భావించారు, వారిలో రగిలిన భావోద్వేగం నాయకులను ఉద్యమ బాట పట్టించింది. అంటే జనం - నేతలు కలిసి సాగిన తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. అయితే ఏపీలో ఆ పరిస్థితి లేదు కదా. ఏపీకి నష్టం జరుగుతున్నా ఇక్కడి ప్రజలు చూస్తూ మిన్నకుండిపోతున్నారే తప్పించి ఉద్యమ బాట పట్టడం లేదు. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నష్టాన్ని కేంద్రం వద్ద ప్రస్తావించి - కేంద్రాన్ని ఒప్పించి న్యాయం చేయించుకుందామన్న కసి ఏపీకి చెందిన నాయకుల్లోనూ లేదు. కేంద్రం మెడలు వంచాల్సిన నేతలే... పోరాటానికి తూట్లు పొడిచేశారు. ఈ క్రమంలో హోదా గురించి పవన్ ఒక్కరే మాట్లాడితే... అదేదో ఆయన సొంత విషయం లాగా అనిపించేస్తోంది. ఇదే విషయాన్ని తనదైన స్టైల్లో చెప్పేసిన పవన్... హోదా ఉద్యమం నుంచి తాను తప్పుకోక ఏం చేస్తానంటూ ప్రశ్నించడం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. నిజమే మరి... ఎవరికీ పట్టని ప్రత్యేక హోదా పవన్ ఒక్కడికి మాత్రం ఎందుకు? అందుకే ఇక ప్రత్యేక హోదా ఉద్యమం నుంచి పవన్ కాస్తంత దూరం జరిగిపోయారని చెప్పాలి.