Begin typing your search above and press return to search.
బీజేపీకి షాకిచ్చిన పవన్.. కీలకమైన ఎమ్మెల్సీ ఎన్నికల వేళ సంచలన నిర్ణయం
By: Tupaki Desk | 11 March 2021 4:30 AM GMTసహనానికి హద్దు ఉంటుందన్న విషయాన్ని జనసేన అధినేతపవన్ కల్యాణ్ తన తాజా ట్వీట్ తో మిత్రుడికి సందేశాన్ని పంపారా? అంటే.. అవునన్న మాట వినిపిస్తోంది. తనెంత నిబద్ధతతో మిత్రుడిగా వ్యవహరిస్తున్నార.. ఆ విషయాన్ని గుర్తించకుండా తరచూ తన విషయంలోనూ.. ఏపీ విషయంలో అనుసరిస్తున్న బీజేపీ తీరుకు పవన్ కల్యాణ్ బాగానే హర్ట్ అయినట్లుగా కనిపిస్తోంది. అందుకే.. మాటలతో కాకుండా చేతలతో తాను చేయాల్సిన పనిని చేసేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
ప్రస్తుతం జరుగుతున్న హైదరాబాద్.. రంగారెడ్డి.. మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటివేళ.. పవన్ కల్యాన్ తన జనసేన పార్టీ ట్విటర్ ఖాతాలో పోస్టు చేసిన ఒక మెసేజ్ రెండు తెలుగురాష్ట్రాల్లో ఆసక్తికర చర్చగా మారింది. తాజా ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికల్లో గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు. అందుకోసం ఇటీవల కాలంలో తమకుదూరమైన అన్ని వర్గాల్ని కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. మరోవైపు మిత్రుడిగా ఉన్న బీజేపీ ఏపీ విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు పవన్ కల్యాణ్ ను వేదనకు గురి చేస్తున్నట్లు చెబుతున్నారు. విశాఖఉక్కు పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేస్తామన్న విషయాన్ని స్పష్టం చేసిన నేపథ్యంలో.. కమలనాథుల మీద తనకున్న ఆగ్రహాన్ని తెలివిగా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నిలిపిన అభ్యర్థికి మద్దతు ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
తాజా నిర్ణయంతో తాను ఎవరి నిర్ణయాల్ని భరించాల్సిన అవసరం లేదన్న సందేశంతో పాటు.. తమ ప్రాధాన్యతలకు ప్రయారిటీ ఇవ్వనప్పుడు.. తాను కూడా అంతేలా స్పందిస్తారన్న విషయాన్ని పవన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో బీజేపీ మిత్రుడిగా ఉంటూ.. తెలంగాణలో ఆ మిత్రుడికి ఏ మాత్రం పొసగని టీఆర్ఎస్ నిలిపిన అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ప్రకటించటం ద్వారా.. బీజేపీకి తగిన గుణపాఠాన్నినేర్పినట్లు అవుతుందని చెబుతున్నారు. ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధిస్తే.. పవన్ ఇమేజ్ అంతో ఇంతో పెరగటమే కాదు.. తెలంగాణ ప్రభుత్వంలో ఆయన పరపతి పెరుగుతుందని మాత్రం చెప్పక తప్పదు. మరి.. పవన్ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ నేతల రియాక్షన్ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా చెప్పక తప్పదు.