Begin typing your search above and press return to search.

వైసీపీకి భయం ఏంటో నేర్పిస్తాను: పవన్ కళ్యాణ్ వీరావేశం

By:  Tupaki Desk   |   29 Sep 2021 12:38 PM GMT
వైసీపీకి భయం ఏంటో నేర్పిస్తాను: పవన్ కళ్యాణ్ వీరావేశం
X
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ గడ్డ మీద సమర నాదం చేశారు. తీవ్ర వ్యాఖ్యలతో వైసీపీపై విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలు గ్రామ సింహాలు అంటూ తాను చేసిన ట్వీట్ తో మొదలుపెట్టి హెచ్చరికలతో దుమ్ము దులిపారు. డిక్షనరీలో గ్రామ సింహాలను ఊరకుక్కలు అంటూ తనపై వైసీపీ నేతలు అరుస్తున్నారంటూ మండిపడ్డారు.

తాను ఏపీ సమస్యలపై మాట్లాడితే తనపై వ్యక్తిగత దాడికి దిగుతారా? అని ప్రశ్నించారు. తాను వైఎస్ వివేకా హత్య, కోడి కత్తి కేసు గురించి మాట్లాడితే నా మూడు పెళ్లిళ్ల గురించి ఎందుకు మాట్లాడుతారంటూ ప్రశ్నించారు. వైసీపీకి భయం అంటే ఏంటో తాను చూపిస్తానని హెచ్చరించాడు.

కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి కొడుతానంటూ వార్నింగ్ ఇచ్చాడు పవన్. తన మూడు పెళ్లిళ్ల గురించి వాళ్లకెందుకని ప్రశ్నించారు. వైసీపీలో అధినేత మొదలు కార్యకర్త వరకు వారి ఇంట్లోని మహిళలకు తాను గౌరవం ఇస్తానని చెప్పుకొచ్చాడు. తప్పుగా మాట్లాడమంటూ హామీ ఇచ్చారు.

నాపై కుక్కల్లా అరుస్తున్నారని.. ఈ సన్నాసులకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే రేర్పలేని సంస్కారాన్ని నేనే నేర్పగలనా అంటూ నిలదీశారు. బూతులు రాక కాదని.. నా హక్కులకు భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోనంటూ స్పష్టం చేశారు.

యుద్ధం మొదలుపెట్టింది వైసీపీ అని.. యుద్ధం ఎలా కావాలి? ప్రజాస్వామ్యంగా అయినా సిద్ధమని పవన్ స్పష్టం చేశారు. మరో రకంగా కావాలన్నా తాను సంసిద్ధమని స్పష్టం చేశారు. మా నాన్న ముఖ్యమంత్రి కాదని.. ఇడుపులపాయ లాంటి ఎస్టేట్ ఇవ్వలేదని.. వేల కోట్లు ఇవ్వలేదని చెబుతూ తన తండ్రి తనకు ఇచ్చింది ధైర్యం, తెగింపు, ధర్మరక్షణ అని చెప్పుకొచ్చాడు.

రాజకీయ కలుపు మొక్కలను తీసేసి మంచి చేయాలని పవన్ ప్రజలకు పిలుపునిచ్చారు. రోడ్లు వేయరని.. ఒక రాజకీయ పార్టీగా హక్కుగా అడుగుతానని స్పష్టం చేశారు.ఒక రాజకీయ పార్టీగా ప్రశ్నిస్తే ప్రతీ సన్నాసి చేత తిట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తనను తిట్టేస్తే కూర్చొని ఏడుస్తానని అనుకుంటున్నారు.. తిట్టే కొద్దీ బలపడుతాను కానీ బలహీన పడను అని స్పష్టం చేశారు. మీరు లాగితే వెనక్కు వెళ్లను.. ఏ ఒక్కరిని మరిచిపోను.. ఎలా కొట్టాలో కూడా నాకు తెలుసు.. నేను యుద్ధం ప్రకటించిన తరువాత వెనక్కి వెళ్లేది లేదని స్పష్టం చేశారు.

ప్రజల డబ్బులతో మీరు మీ తండ్రులు, అన్నల పేర్లతో పథకాలు పెట్టి పంచుతారా? అని పవన్ ప్రశ్నించారు. కిరాయి మూకలు, బాంబుల దాడులు, కోడికత్తి గ్యాంగులతో భయపడేది లేదని పవన్ స్పష్టం చేశారు. పవన్ భయపడడు అని.. సినిమా టికెట్లతో నాకు ఏం నష్టం అని ప్రశ్నించారు. తనకు థియేటర్లు లేవని.. సన్నాసుల్లారా ఎవరికి థియేటర్లు ఉన్నాయో మీకు తెలియదా? అని ప్రశ్నించారు. వైసీపీ వాళ్లకే ఎక్కువ థియేటర్లు ఉన్నాయన్నారు. టికెట్ ధరలు ఏదైనా పెట్టుకోండి.. ఒకరి కష్టార్జితాన్ని దోచుకోవడానికి మీరెవరు అంటూ ప్రశ్నించారు.

టికెట్ ధరలను ఆన్ లైన్ చేస్తున్న మీరు భారతి సిమెంట్స్ ను ఉచితంగా పంచవచ్చు కదా? అని ప్రశ్నించారు. సినిమా వాళ్ల డబ్బులపై ఎందుకు పడుతారని ప్రశ్నించారు. ఇళ్లలోకి వెళ్లి ప్రజల బంగారం లాక్కోండి అంటూ ధ్వజమెత్తారు. కాట్ల కుక్కల్లా అరుస్తారేంటి? మాట్లాడడం ఎప్పుడు నేర్చుకుంటారంటూ ప్రశ్నించారు.

మీలాంటి వాళ్లకు లొంగేది లేదని.. వచ్చేది జనసేన ప్రభుత్వం అని.. ఇంతకు ఇంత బదులు తీర్చుకుంటామని.. రాసి పెట్టుకుంటున్నామని తాట తీసి కూర్చోబెడుతాం అంటూ పవన్ హెచ్చరించారు. మేం నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.

-పవన్ మాట్లాడిన వీడియోను కింద చూడొచ్చు..