Begin typing your search above and press return to search.

పోసాని వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

By:  Tupaki Desk   |   29 Sept 2021 8:17 PM IST
పోసాని వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్
X
నటుడు రచయిత పోసాని కృష్ణమురళి నిన్న సికింద్రాబాద్ ప్రెస్ క్లబ్ లో జనసేనాని పవన్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ఇవి రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకరేపాయి. పవన్ వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబంపై పోసాని దారుణ విమర్శలు చేశారు. ఈరోజు ఏపీలో జనసేన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. పోసాని చేసిన కామెంట్స్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

గ్రామ సింహాలంటూ ఇటీవల చేసిన ట్వీటుతో పవన్ కళ్యాణ్ ప్రసంగం మొదలుపెట్టారు. నాపై వైసీపీ నేతలు, జగన్ కూడా వ్యక్తిగత కామెంట్లు చేశారని పేర్కొన్న పవన్ కళ్యాణ్ నిన్నటి పోసాని విషయం గురించి నేరుగా స్పందించకపోయినా నేను కానీ.. మా కార్యకర్తలు కానీ వైసీపీ నేతల ఇళ్లల్లోని ఆడవాళ్ల గురించి మాట్లాడమని హామీ ఇచ్చారు. మాట తప్పను.. మడమ తిప్పను అని నేను మాటలు చెప్పనని.. చేసి చూపిస్తానని పవన్ అన్నారు.

వైసీపీ కిరాయి మూకలకు భయపడనని పోసానిపై పవన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మా ఇంటి ఆడపడుచుల గురించి మాట్లాడుతారా? అంటూ ఆయన ప్రశ్నించారు. డబ్బుల్లేకుంటే పస్తులు ఉంటాను కానీ.. చేయి చాచనన్న పవన్  ఈ పార్టీ కార్యాలయాన్ని కూడా నా బిడ్డల గురించి దాచుకున్న ఫిక్స్ డ్ డిపాజిట్ల డబ్బుతో కొన్నానని అన్నారు.

తనపై విమర్శలు చేసిన వారిని మొరిగే వీధుకుక్కలతో పోల్చారు. తనను తిడితే ఇంట్లో కూర్చుండి ఏడుస్తానని అనుకున్నారని.. కానీ ఎంత తిడితే అంత తిరుగబడుతానని పవన్ చెప్పుకొచ్చాడు. కృంగిపోయే మనిషిని కాదన్నారు. వైసీపీకి ఇంతకింత ఇంత ప్రతీకారం తీర్చుకుంటామని సవాల్ చేశారు.